Ukraine drone attack: మాస్కోపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:29 AM
భద్రత దృష్ట్యా వునుకోవో, దొమొడేదేవో విమానాశ్రయాల్లో విమానాలను నిలిపివేసినట్టు రష్యా పౌరవిమానయాన సంస్థ రోసావియత్సియా తెలిపింది. మరోవైపు రాత్రి సమయంలో మాస్కో వైపు దూసుకు వస్తున్న డ్రోన్లలో తొమ్మిదింటిని రష్యా వాయు సేన కూల్చివేసిందని మేయర్ సెర్గెల్ సొబ్యానిన్ తెలిపారు.
రెండు విమానాశ్రయాల మూసివేత
9 డ్రోన్లను కూల్చివేసిన రష్యా
మాస్కో, జూన్ 8: ఉక్రెయిన్ ఆదివారం ఏకంగా రష్యా రాజధాని మాస్కోపైనే డ్రోన్లతో దాడి చేసింది. ఈ కారణంగా నగరంలోని రెండు కీలక విమానాశ్రయాలను మూసివేయాల్సి వచ్చింది. భద్రత దృష్ట్యా వునుకోవో, దొమొడేదేవో విమానాశ్రయాల్లో విమానాలను నిలిపివేసినట్టు రష్యా పౌరవిమానయాన సంస్థ రోసావియత్సియా తెలిపింది. మరోవైపు రాత్రి సమయంలో మాస్కో వైపు దూసుకు వస్తున్న డ్రోన్లలో తొమ్మిదింటిని రష్యా వాయు సేన కూల్చివేసిందని మేయర్ సెర్గెల్ సొబ్యానిన్ తెలిపారు. డ్రోన్ల ఽశిథిలాలు పడే చోటికి అత్యవసర సేవల వాహనాలను పంపించినట్టు చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని చెప్పారు. తులా రీజియన్‌లో ఉన్న అజోట్ రసాయనాల కర్మాగారంపై కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ కారణంగా కొద్ది సేపు మంటలు వ్యాపించాయి. ఇద్దరు గాయపడ్డారు. కులుగ రీజియన్‌లో ఏడు ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్టు అక్కడి గవర్నర్ తెలిపారు. ఇవన్నీ మాస్కో నగరానికి సమీపంలో ఉన్న రీజియన్లు కావడం గమనార్హం. ఈ దాడులపై ఉక్రెయిన్ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News