Share News

Vladimir Putin Poop Suitcase: పుతిన్‌తో పాటు పూప్‌ సూట్‌కేస్‌

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:19 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భద్రతకు ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి పూప్‌..

Vladimir Putin Poop Suitcase: పుతిన్‌తో పాటు పూప్‌ సూట్‌కేస్‌

  • అలాస్కాకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది

  • సూట్‌కేస్‌లో మలవ్యర్థాలన్నీ మాస్కోకు

  • ఆరోగ్య వివరాలు ఎవరికీ తెలియకుండా ఉండేందుకే

న్యూఢిల్లీ, ఆగస్టు 18: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భద్రతకు ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ‘పూప్‌ (మలవ్యర్థాల) సూట్‌కేస్‌’ ఓ ఉదాహరణ. ఇటీవల అలాస్కాలో ట్రంప్‌తో పుతిన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఓ ప్రత్యేక బాధ్యతలో కనిపించారు. అదేమిటి అంటే ఆయన కాలకృత్యాల తర్వాత ఆ మల మూత్రాలను సేకరించే పని. సేకరించిన వ్యర్థాలను ఓ సూట్‌కేసులో భద్రపరిచి తిరిగి మాస్కోకు తీసుకెళ్లిపోయారు. ఇలా ఎందుకంటే, విదేశీ శక్తులు ఎవరూ ఆ వ్యర్థాలతో పుతిన్‌ ఆరోగ్య వివరాలేవీ కనిపెట్టకుండా ఉండటానికని తెలుస్తోంది. చాలా ఏళ్ల నుంచి భద్రతా సిబ్బంది ఇదే విధంగా చేస్తున్నారు. 2017లో పుతిన్‌ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లినప్పటి నుంచి భద్రతా అధికారులు ఇలా చేస్తున్నారని ఎక్స్‌ప్రెస్‌ యూఎస్‌ వార్తా సంస్థ కథనం తెలిపింది.

Updated Date - Aug 19 , 2025 | 02:19 AM