Putins Gift to Trump: పుతిన్ గిఫ్ట్‌తో బిత్తరపోయిన ట్రంప్ దూత
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:11 AM
ఉక్రెయిన్‌తో యుద్ధా న్ని ఆపేందుకు ట్రంప్ దూతగా వచ్చిన స్టీవ్ విట్కా్‌ఫకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ..
ఆర్డర్ ఆఫ్ లెనిన్ పతకం విట్కా్‌ఫకు అందజేత
సీఐఏ అధికారిణి జూలియాన్‌కు ఇవ్వాలని సూచన
జూలియాన్ కుమారుడు గ్లోస్ సాహసానికి గుర్తుగా పతకం
మాస్కో, ఆగస్టు 10: ఉక్రెయిన్‌తో యుద్ధా న్ని ఆపేందుకు ట్రంప్ దూతగా వచ్చిన స్టీవ్ విట్కా్‌ఫకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన బహుమతిపై కలకలంరేగింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ డిప్యూటీ డైరక్టర్ జూలియాన్‌కు అందజేయాలంటూ ఆర్డర్ ఆఫ్ లెనిన్ పతకాన్ని ఇచ్చారు. సీఐఏ అధికారిణి జూలియాన్ కుమారుడు మైఖేల్ గ్లోస్.. రష్యా తరపున ఉక్రెయిన్‌పై పోరాడి మరణించాడని, అతడి సాహసానికి గుర్తుగా ఈ పతకం ఇచ్చామని చెప్పాలన్నారు. సీఐఏలో పనిచేసే ఉన్నత స్థాయి అధికారుల కుటుంబ సభ్యులు కూడా రష్యా తరపున ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నారని పుతిన్ చెప్పకనే చెప్పా రు. పుతిన్ మైండ్ గేమ్‌తో విట్కాఫ్ బిత్తరపోయినట్లు సమాచారం. దీనిపై సీఐఏ గానీ, అమెరికా గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. రష్యా గూఢచార సంస్థ కేజీబీలో పనిచేసిన పుతిన్ గతంలోనూ అనేకసార్లు తన చర్యలతో ప్రత్యర్థులను షాక్‌కు గురిచేశారు. గతంలో తనను కలిసేందుకు వచ్చిన జర్మనీ నేత వద్దకు పుతిన్ తన పెంపుడు కుక్కనుపంపి భయపెట్టారు. మరో సందర్భంలో ఫ్రాన్స్ నేతను దూరంగా కూర్చోబెట్టి మాట్లాడారు.
పావుగా వాడుకుని ఉంటారు
రష్యా తరపున ఉక్రెయిన్‌తో పోరాడుతూ గత ఏడాది ఏప్రిల్ 4న మైఖేల్ గ్లోస్ మరణించాడని రష్యా చెబుతోంది. గ్లోస్ గతంలో తన సోషల్ మీడియాలో రష్యాకు అనుకూలంగా పోస్టులు పెట్టారు. మాస్కోలోని రెడ్ స్క్వెర్‌లో దిగిన సెల్ఫీలు, ఫొటోలు కూడా పోస్ట్ చేశారు. రష్యా సైన్యంలో చేరినప్పుడు మైఖేల్ గ్లోస్ తల్లిదండ్రుల పూర్తి వివరాలు క్రెమ్లిన్‌కు కూడా తెలియదని సమాచారం. మరోవైపు మైఖేల్ గ్లోస్ మరణంపై ఆయన తండ్రి లారీ గ్లోస్ స్పందించారు. తమ కుమారుడికి మానసిక సమస్యలున్నాయని తెలిపారు. రష్యా తరపున యుద్ధం చేసినట్లు తమకు సమాచారం లేదని, పావుగా వాడుకుని ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మైఖేల్ గ్లోస్ మృతదేహం అమెరికాకు చేరుకున్నప్పుడు సీఐఏ ప్రకటన విడుదల చేసింది.