Ukraine: పుతిన్‌తో ట్రంప్ చర్చలు నేడే
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:21 AM
ఈ విషయాన్ని అటు రష్యా, ఇటు అమెరికా కూడా ధ్రువీకరించాయి. ఇప్పటికే ఒకసారి ట్రంప్.. రష్యా అధినేతతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో అసంపూర్తిగా చర్చలు ముగిశాయి. దీంతో తాజాగా మరోసారి పుతిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు.
అమెరికా, రష్యా వెల్లడి
ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికే అవకాశం
వాషింగ్టన్, మార్చి 17: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని అటు రష్యా, ఇటు అమెరికా కూడా ధ్రువీకరించాయి. ఇప్పటికే ఒకసారి ట్రంప్.. రష్యా అధినేతతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో అసంపూర్తిగా చర్చలు ముగిశాయి. దీంతో తాజాగా మరోసారి పుతిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే.. యుద్ధం ముగింపునకు సంబంధించి తమకు బలమైన హామీలు ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది. నాటో సభ్యత్వం నుంచి ఉక్రెయిన్‌ను మినహాయించాలని పట్టుబడుతోంది. అంతేకాదు, ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని కోరుతోంది. వాస్తవానికి అమెరికా ఇరు దేశాలకు 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించింది. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. కానీ, రష్యా అధినేత పుతిన్ మాత్రం.. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి విరామం ఇచ్చేముందు కీలకమైన షరతులను నెరవేర్చాల్సి ఉందని పేర్కొన్నారు.
ప్రతీకార సుంకాలపై తగ్గేదే లేదన్న ట్రంప్
రంగాలవారీ టారి్‌ఫలతోపాటు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనున్న ప్రతీకార సుంకాలపై అమెరికా వాణిజ్య భాగస్వాములకు మినహాయింపు ఇచ్చే ఉద్దేశం ఏమీ లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు ఇచ్చే ఉద్దేశం తనకు లేదని పదే పదే చెబుతున్న ట్రంప్ తాజాగా ఆదివారం కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలం చివరలో ప్రసాదించిన క్షమాభిక్షలు చెల్లవని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆటో పెన్ ద్వారా సంతకం చేసిన ఆ క్షమాభిక్షలన్నీ బైడెన్ పూర్తి అవగాహన లేకుండా ఆమోదించినవని ట్రంప్ తేల్చిచెప్పారు. అందువల్ల ఆ క్షమాభిక్షలు జారీ చేసిన అధికారులు నేరానికి పాల్పడినట్టేనన్నారు. ప్రత్యేకించి జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి ఘటనను దర్యాప్తుచేసిన హౌస్ కమిటీ సభ్యులకు మంజూరు చేసిన క్షమాభిక్షల చట్టబద్ధతను ‘ట్రూత్ సోషల్’ పోస్టులో ట్రంప్ తోసిపుచ్చారు. ‘నిద్రమత్తులో జో బైడెన్ ఎంపిక కానటువంటి పొలిటికల్ థగ్స్ కమిటీకి, అనేకమంది ఇతరులకు ప్రసాదించిన క్షమాభిక్షలు చెల్లవు. అవి ఇక ఏ మాత్రం అమలులో ఉండబోవని ప్రకటిస్తున్నా. ఎందుకంటే వాటిపై ఆటో పెన్‌తో సంతకం చేశారు. అంటే వాటిపై జో బైడెన్ సంతకం చేయలేదని అర్థం. మరీ ముఖ్యంగా వాటి గురించి బైడెన్‌కు అసలు ఏమీ తెలియదు. ఆ క్షమాభిక్షల గురించి బైడెన్ సరిగా వెల్లడించనే లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
మోదీ పాడ్‌కా్‌స్టను షేర్ చేసిన ట్రంప్
అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రీడ్‌మన్ షోలో భారత ప్రధాని మోదీ సంభాషణ వీడియోను ట్రంప్ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రంప్ నాయకత్వాన్ని ఆ షోలో మోదీ ప్రశంసించారు. ట్రంప్‌తో తాను సమావేశమైన సందర్భాలను చిరస్మరణీయ ఘటనలుగా పేర్కొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొనసాగుతున్న తమ సంబంధాలనూ ఆ షోలో మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఆ షో యూట్యూబ్ లింక్‌ను తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్