Modi Cyprus Visit: సైప్రస్ చేరిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:02 AM
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలీడెస్ స్వయంగా లర్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలకడం విశేషం.
నికోసియా, న్యూఢిల్లీ జూన్ 15: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలీడెస్ స్వయంగా లర్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలకడం విశేషం. రెండు దశాబ్దాల అనంతరం భారత ప్రధాని సైప్రస్ సందర్శనకు రావడం ఇదే ప్రథమం. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర రంగాల్లో సంబంధాలు పుంజుకుంటాయని మోదీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీది చరిత్రాత్మక పర్యటన అంటూ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాలోని కనానస్కి్‌సకు వెళ్లనున్నారు. అక్కడ జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం క్రొయేషియా దేశంలో పర్యటించనున్నారు.