Share News

Pakistan diplomacy: పాక్‌.. కాపీ పేస్ట్‌ దౌత్యం

ABN , Publish Date - May 19 , 2025 | 04:53 AM

పాకిస్థాన్‌ ఉగ్రవాద ముట్టడులపై ప్రపంచంలో తన పక్షాన్ని చాటుకోవడానికి శాంతి ప్రతినిధి బృందాలను ప్రముఖ దేశాలకు పంపుతోంది. భారత ప్రభుత్వం కూడా తన వ్యూహాలను బలపరచడానికి ఏడు అఖిలపక్ష బృందాలను నియమించింది.

Pakistan diplomacy: పాక్‌.. కాపీ పేస్ట్‌ దౌత్యం

భారత్‌కు కౌంటర్‌గా విదేశాలకు శాంతి ప్రతినిధుల బృందం

ఇస్లామాబాద్‌, మే 18: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న అపఖ్యాతి నుంచి బయటపడేందుకు, ప్రపంచ వేదికపై తన పరువు ప్రతిష్ఠలు కాపాడుకోవడానికి పాకిస్థాన్‌ నానాపాట్లు పడుతోంది. పాక్‌ కుతంత్రాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను నియమించింది. దీన్ని కాపీ కొడుతూ శాంతి కోసం తాము పాకులాడుతున్నామనే వాదనను వినిపించడానికి పాక్‌ సిద్ధమైంది. తమపై భారత్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడానికి ఒక ఉన్నత స్థాయి దౌత్య ప్రతినిధి బృందాన్ని ప్రధాన దేశాలకు పంపడానికి ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నిర్ణయించారని రేడియో పాకిస్థాన్‌ నివేదించింది. భారత ప్రభుత్వం తమ దౌత్య బృందాల వివరాలను వెల్లడించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడింది. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని ఈ శాంతి ప్రతినిధి బృందం అమెరికా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్‌, రష్యాల్లో పర్యటిస్తుందని...శాంతి, స్ధిరత్వం కోసం పాక్‌ చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తుందని పీఎంవో పేర్కొంది.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:53 AM