Indus Water Treaty: సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించండి
ABN , Publish Date - May 15 , 2025 | 03:00 AM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసే భారత్ నిర్ణయాన్ని పాకిస్థాన్ పున:సమీక్షించాలని కోరింది. నీటి సంక్షోభం కారణంగా పాకిస్థాన్‌లో తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడుతుందని పాకిస్థాన్ హెచ్చరించింది.
భారత్‌కు పాకిస్థాన్ జలవనరుల శాఖ లేఖ
ఇస్లామాబాద్, మే 14: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించాలని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది. సింధూ జలాలు నిలిపివేస్తే పాకిస్థాన్‌లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆదేశ జలవనరుల శాఖ భారత విదేశాంగశాఖకు లేఖ రాసింది. దీనిపై భారత్‌తో చర్చించడానికి సిద్ధమని తెలిపింది. వాస్తవానికి భారత్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు సింధూ నదిలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందని వ్యాఖ్యానించిన పాక్.. ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ తర్వాత వెంటనే దారిలోకొచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించినా సింధూజలాల ఒప్పందంపై వైఖరి మార్చుకోబోమని భారత్ తేల్చి చెప్పింది. పాక్‌తో చర్చలంటూ జరిగితే పీఓకే, ఉగ్రవాదంపైనే జరుగుతాయని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ తరుణంలో పాక్ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1960లో భారత్-పాక్ మధ్య సింధూ జలాల ఒప్పందం కుదిరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News