Pakistan PM Shehbaz Sharif: పాక్ ప్రధానికి ఘోర అవమానం.. 40 నిమిషాలు వెయిట్ చేసినా..
ABN , Publish Date - Dec 13 , 2025 | 08:05 AM
ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం ఎదురైంది. తుర్కిమెనిస్థాన్‌లో జరిగిన మీటింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ షరీఫ్‌ను అస్సలు పట్టించుకోలేదు. పుతిన్, ఎర్డోగాన్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కూడా వెళ్లారు. ఓ రూములో పుతిన్, ఎర్డోగాన్‌లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అక్కడ షరీఫ్ లేరు. వేరే రూములో పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పుతిన్, ఎర్డోగాన్‌ల మధ్య మీటింగ్ మొదలై 40 నిమిషాలు పైనే గడిచింది. అయినా షరీఫ్‌కు పిలుపురాలేదు.
దీంతో అసహనానికి గురైన షరీఫ్... పుతిన్, ఎర్డోగాన్ మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. రూములోకి ప్రవేశించి సోఫాలో కూర్చున్నారు. అయితే, పుతిన్ కానీ, ఎర్డోగాన్ కానీ షరీఫ్‌ను పట్టించుకోలేదు. వారి మానాన వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. 10 నిమిషాలు గడిచాయి. అయినా ఆయనను ఎవ్వరూ పలకరించను కూడా లేదు. దీంతో షరీఫ్ కోపం కట్టలు తెంచుకుంది. అక్కడినుంచి గబగబా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ సంఘటనపై ఆర్టీ ఇండియా స్పందిస్తూ... ‘ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు.
ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు’ అని వెల్లడించింది.
ఇండియా పర్యటనలో పుతిన్ జోష్..
రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పుతిన్ ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రధాని మోదీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. రెండు రోజుల పాటు సందడి సందడిగా గడిపారు. పర్యటన సందర్భంగా ఇద్దరూ చాలా సార్లు ప్రోటోకాల్స్‌ను బ్రేక్ చేశారు.
ఇవి కూడా చదవండి
మీడియా హక్కులు యాథాతథమే.. స్పష్టం చేసిన ఐసీసీ, జియోస్టార్