Share News

Simla Agreement: సిమ్లా ఒప్పందం అమల్లోనే ఉంది: పాక్ క్లారిటీ

ABN , Publish Date - Jun 06 , 2025 | 09:31 PM

సిమ్లా ఒప్పందం అమల్లోనే ఉందని పాక్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఈ ఒప్పందం కథ ముగిసిందంటూ పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చింది.

Simla Agreement: సిమ్లా ఒప్పందం అమల్లోనే ఉంది: పాక్ క్లారిటీ
Simla Agreement Pakistan

భారత్, పాక్‌ల మధ్య 1971 నాటి యుద్ధం తరువాత కుదిరిన సిమ్లా ఒప్పందం కథ ముగిసిందంటూ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. సిమ్లా ఒప్పందం యథాతథంగా కొనసాగుతోందని పేర్కొంది. ఒప్పందం నిలుపుదలపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. భారత్, పాక్ మధ్య ఎలాంటి వివాదమైనా ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలంటూ ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ వివాదాల్లో మూడో పక్షం జోక్యాన్ని అనుమతించకూడదని నిర్ణయించాయి.


ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ సిమ్లా ఒప్పందం ప్రస్తావన తెచ్చింది. ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఇక మంగళవారం నాటి టీవీ ఇంటర్వ్యూలో పాక్ రక్షణ శాఖ మంత్రి సిమ్లా ఒప్పందం కథ ముగిసిందని అన్నారు. ఏకపక్షంగా ఆర్టికల్ 370 రద్దుతో సిమ్లా ఒప్పందం నిరర్థకమైందని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1948కు పూర్వపు స్థితి నెలకుందని చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య విభేదాలకు ఇతర దేశాల సాయంతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.


ఈ కామెంట్ వైరల్ అయిన వెంటనే పాక్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మంత్రి కామెంట్స్‌పై విదేశాంగ శాఖ అధికారి స్పందించారు. ఇటీవలి పరిణామాలతో పాక్‌లో సిమ్లా ఒప్పందంపై చర్చ మొదలైనప్పటికీ ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏ ద్వైపాక్షిక ఒప్పందం నిలుదలకు చర్యలు తీసుకోవట్లేదని పేర్కొన్నారు. అన్ని ఒప్పందాలు అమల్లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

పహల్గాం దాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, పాక్ మే 8 నుంచి 10 మధ్య సైనిక దాడులకు దిగగా భారత్ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. ఆ తరువాత మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

ఇవీ చదవండి:

మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్

పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 09:38 PM