Islamabad: భారత్‌తో యుద్ధం ఇస్లామిక్ వార్ కాదు... ఇస్లామిక్ క్లెరిక్ ఘాజి
ABN , Publish Date - May 06 , 2025 | 03:50 PM
సొంత ప్రజానీకంపైనే ఒక పద్ధతి ప్రకారం పాక్ హింసకాండకు పాల్పడుతోందని, సొంత ప్రజలకే అన్యాయం చేస్తోందని ఇస్లామాబాద్ లాల్ మసీద్ క్లెరిక్ అబ్దుల్ అజీజ్ ఘాజీ విరుచుకుపడ్డారు.
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సొంత దేశంలోనే పాక్‌కు వ్యతిరేకత ఎదురవుతోంది. సొంత ప్రజానీకంపైనే ఒక పద్ధతి ప్రకారం పాక్ హింసకాండకు పాల్పడుతోందని, సొంత ప్రజలకే అన్యాయం చేస్తోందని ఇస్లామాబాద్ లాల్ మసీద్ క్లెరిక్ అబ్దుల్ అజీజ్ ఘాజీ విరుచుకుపడ్డారు. వివాదాస్పద మత బోధకుడుగా పేరున్న ఘాజీ... పాకిస్థాన్‌లోని అంతర్గత కల్లోలంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pakistan: పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. ఫలితం లేకుండా పోయిన UNSC మీటింగ్
లాల్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్, ఇండియా మధ్య యుద్ధం అంటూ జరిగితే ఎంతమంది ప్రజలు పాకిస్థాన్‌ను సమర్ధిస్తారో చేతులెత్తండని కోరారు. ప్రార్థనలకు హాజరైన వారికి స్పందన కొరవడటం, ఎలాంటి బదులు రాకపోవడంతో ఆయన తిరిగి స్పందిస్తూ, ఏదో కొద్దిమంది చేతులెత్తడం కనిపిస్తోందని, ప్రజల్లో వివేకం మేల్కొందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. పాకిస్థాన్, ఇండియా మధ్య యుద్ధం ఎంతమాత్రం ఇస్లామిక్ వార్ కాదన్నారు.
''ఇవాళ పాకిస్థాన్‌లో ఉన్న వ్యవస్థ అపనమ్మకాల వ్యవస్థ. ఇండియా కంటే దయనీయమైన నిరంకుశ వ్యవస్థ. పాకిస్థాన్‌లో ఉన్నంత అణచివేత ఇండియాలో లేదు. లాల్ మజీద్ వంటి ఘారమైన ఘటన ఇండియాలో జరిగిందా? వజరిస్థాన్, ఖైబర్ ఫక్తుంఖ్వాలో జరుగుతున్నని అకృత్యాలు ఇండియాలో చోటుచేసుకుంటున్నాయా? వాళ్ల (ఇండియా) యుద్ధ విమానాలు సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్నారా? ఇండియాలో జాడతెలియకుండా పోయిన వారెంతమంది? ఇక్కడ జాడ తెలియకుండా పోయిన తమ కుటుంబ సభ్యుల కోసం నిరసనలు చేసి చేసి ప్రజలు విసిగి వేసారి పోతున్నారు. మత బోధకులు, పాత్రికేయులు మాయమవుతున్నారు. తెహ్రిక్-ఇ-ఇన్సాప్ సభ్యుల జాడ తెలియడం లేదు'' అంటూ పాక్‌పై ఘాజీ విరుచుకుపడ్డారు. షెహబాజ్ షరీద్ ప్రభుత్వా్న్ని ఘాజీ బహిరంగంగానే విమర్శించడం సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
ఇవి కూడా చదవండి..