Pakistan: పాక్ నుంచి బంగ్లాకు 50వేల టన్నుల బియ్యం
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:27 AM
ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (టీసీపీ) ద్వారా 50వేల టన్నుల పాకిస్థాన్ బియ్యాన్ని కొనేందుకు ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ అంగీకరించ డంతో కుదిరిన ఒప్పందం ఇందుకు దారితీసింది.

బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత పాక్‌తో ప్రత్యక్ష వాణిజ్యం ఇదే తొలిసారి
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 23: పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు చిగురించాయి. 1971లో పాక్, బంగ్లాదేశ్‌లు విడిపోయిన అనంతరం మొదటిసారిగా ఈ దేశాల మధ్య ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభమైంది. ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (టీసీపీ) ద్వారా 50వేల టన్నుల పాకిస్థాన్ బియ్యాన్ని కొనేందుకు ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ అంగీకరించ డంతో కుదిరిన ఒప్పందం ఇందుకు దారితీసింది. ఈ ఒప్పందం మేరకు ప్రభుత్వం ఆమోదించిన మొదటి కార్గో.. శనివారం కరాచీలోని పోర్ట్ ఖాసిమ్ నుంచి బంగ్లాదేశ్ పోర్ట్‌కు బయలుదేరింది. 1971లో తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఏర్పాటైంది. గత ఏడాది బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకోవడంతో యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలకు చేతులు చాచడంతో పాక్ సానుకూలంగా స్పందిస్తోందంటున్నారు.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.