Share News

Netanyahu: బందీల జాబితా ఇస్తేనే ఒప్పందం

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:16 AM

కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్‌ 33 మంది బందీల పేర్లతో జాబితాను విడుదల చేసేవరకు ముందుకెళ్లబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.

Netanyahu: బందీల జాబితా ఇస్తేనే ఒప్పందం

టెల్‌ అవీవ్‌, జనవరి 18: కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్‌ 33 మంది బందీల పేర్లతో జాబితాను విడుదల చేసేవరకు ముందుకెళ్లబోమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఒప్పందం ఉల్లంఘిస్తే పూర్తి బాధ్యత హమా్‌సదే అవుతుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఒట్జామా యెహుదిత్‌ పార్టీ నేత, జాతీయ భద్రతా శాఖ మంత్రి ఇటామర్‌ బెన్‌ గ్విర్‌ తప్పుకున్నారు. దీంతో నెతన్యాహుపై రాజకీయంగా కూడా ఒత్తిడి పెరుగుతోంది. వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి రావాలి. దీని ప్రకారం 33 మంది బందీలను హమాస్‌, 737 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేయాలి.

Updated Date - Jan 19 , 2025 | 03:16 AM