Share News

Jerome Kerviel: ఇతను లక్కీ భాస్కర్.. స్కాం వాల్యూ రూ.4,95,000 కోట్లకు పైగా

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:06 PM

అగ్రశ్రేణి వ్యాపారి అత్యంత పేదవాడైన తీరిది. సినిమా పరిభాషలో చెప్పాలంటే, ఇతడు అన్ లక్కీ భాస్కర్. ఇతని దెబ్బకి బ్యాంకింగ్ రంగమే కుదైలైపోయింది. ఇతని అప్పుల భారమెంతో తెలుసా అక్షరాలా రూ. 4,95,000 కోట్లకు పైగా. అదీ 2008 నాటికి.

Jerome Kerviel: ఇతను లక్కీ భాస్కర్.. స్కాం వాల్యూ రూ.4,95,000 కోట్లకు పైగా
Jerome Kerviel

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత ధనవంతులెవరని ఆరా తీస్తే.. ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇంకా జెఫ్ బెజోస్ వంటి పేర్లు మనకు వస్తాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత పేదవాడు ఎవరిని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, గుడిసె, భిక్షమెత్తుకునే ఖాళీ గిన్నె, ఇంకా చిరిగిన బట్టలు వెరసి 'బిచ్చగాడు' అనే పదాన్ని స్పురణకు తెస్తాయి.

Jerome-Kerviel.jpgపై చిత్రంలో జెరోమ్ కెర్వియల్ ని చూడగానే పారిస్ వీధుల్లో తిరుగుతున్న సాధారణ ఒక యాచక వ్యక్తిలా మీకనిపించొచ్చు. అయితే, అతని కథ సాధారణమైనది కాదు! పేదరికం, అతని దుస్తులు, ఆహార లేమి.. వీటి కంటే ఎక్కువ జెరోమ్ కెర్వియల్ అతి పెద్ద ఆర్థిక భారాన్ని మోస్తున్నాడు. ఇది ఎంత పెద్దదంటే, అతని దెబ్బకు ఆ దేశ బ్యాంకింగ్, మనీ మార్కెట్టే షాక్‌కు గురైంది. ఇక, అది ఎంతంటే.. అతను 'ప్రపంచంలోని అత్యంత పేదవాడు' అనే బిరుదునిచ్చేంత.

ఎవరీ జెరోమ్ కెర్వియెల్ ?

జనవరి 11, 1977న, పాంట్-ఎల్'అబ్బే అనే చిన్న ఫ్రెంచ్ పట్టణంలో జన్మించిన జెరోమ్.. ఒక నిరాడంబరమైన ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతని వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. జెరోమ్ తల్లి ఒక హెయిర్ డ్రెస్సెర్, అతని తండ్రి కమ్మరిగా పనిచేశాడు. చిన్ననాటి నుంచి జెరోమ్ మంచి విద్యార్థి. చదువులో చాలా చురుకైన వాడు. అతను లూమియర్ యూనివర్సిటీ లూమియర్ లియోన్ 2 నుండి ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. చదువు పూర్తి చేసిన వెంటనే, అతన్ని ఫ్రాన్స్‌లోని మూడవ అతిపెద్ద బ్యాంకు అయిన సొసైటీ జనరల్ ఉద్యోగంలోకి తీసుకుంది.

ఇక, బ్యాంకులో, అతను జూనియర్ డెరివేటివ్స్ ట్రేడర్‌గా పనిచేశాడు. అయితే, అతని టెక్నాలజీ పరిజ్ఞానం, అద్భుతమైన ట్రేడింగ్ సామర్థ్యం అతన్ని మిలియన్ల డాలర్ల ఒప్పందాలను కవర్ చేయడానికి దోహదపడింది. అతను ఎల్లప్పుడూ బ్యాంకు యొక్క డెల్టా వన్ విభాగంలో పార్ట్‌గా ఉండేవాడు. ఈ విభాగం షేర్ ట్రేడింగ్, అల్గోరిథం లు ఇంకా పెట్టుబడుల వ్యవహారాలు చూస్తుంది.

జెరోమ్‌కు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ట్రేడింగ్ సిస్టమ్‌ల గురించి అపారమైన జ్ఞానం ఉంది. అయితే, అతను ఈ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని దుర్వినియోగం చేశాడు. వాటిని తప్పుడు మార్గాల్లో ఉపయోగించాడు. జెరోమ్ ఆర్బిట్రేజ్ చేయడానికి బ్యాంకు లోని లోపాల్ని దుర్వినియోగం చేశాడు. మొదట్లో, అతను కంపెనీ మూలధనాన్ని ఉపయోగించి బిలియన్ల డాలర్ల వ్యాపారం చేశాడు. మొదట భారీ లాభాలను ఆర్జించాడు. ఒక్క క్యాలెండర్ ఇయర్లో దాదాపు $73 బిలియన్ల విలువైన వ్యాపారాలు చేశాడు.

జెరోమ్ తాను చేసిన ప్రతి అక్రమ లావాదేవీల్నీ దాచడానికి తనకున్న టెక్నాలజీ సమర్థతను ఉపయోగించినందున అతని వ్యవహారం చాలా ఆలస్యంగా బయటపడింది. చివరికి 2008లో మోసం బయటపడి, దర్యాప్తు ప్రారంభమైంది. ఇది ఎంత పెద్దదంటే, బ్యాంకింగ్ వ్యవస్థ, దాని అనుబంధ రంగాల్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినంత.


ఈ కుంభకోణంపై విచారణ జరిపిన తరువాత, జెరోమ్ అనధికార వ్యాపారం వల్ల బ్యాంకుకు సుమారు $7.2 బిలియన్ల నష్టం వాటిల్లిందని, అంటే రూ.4,95,000 కోట్లకు పైగా నష్టం వచ్చిందని నిర్ధారించారు. ఈ మొత్తం అతనికి రుణ భారంగా మారింది. ఇది అతన్ని ప్రపంచంలోని అత్యంత పేదవారిలో ఒకరిగా చేసింది.

ఈ ఘటన తర్వాత, జెరోమ్ 2015లో 3 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాడు. నమ్మక ద్రోహం, మోసం, కంప్యూటర్ సిస్టమ్‌లను దుర్వినియోగ పర్చడం వంటి అనేక ఆరోపణలకు అతను నేరాన్ని అంగీకరించాడు. అతని శిక్ష పూర్తయినప్పటికీ, రుణ భారం నేటికీ అలాగే ఉంది.

జైలు నుండి విడుదలైన తర్వాత, జెరోమ్ సాదా జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అప్పుల భారం ఇప్పటికీ అతన్ని ప్రపంచంలోని అత్యంత పేదవారిలో ఒకరిగానే నిలుపుతోంది. కొందరు మాత్రం అతను దురుద్దేశ్యంతో వ్యవహరించలేదని వాదిస్తారు. మరికొందరు అతను దురాశతో వ్యవహరించాడని, వ్యవస్థను ఉపయోగించుకున్నాడని చెబుతారు. ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే, ఒకప్పుడు బ్యాంకు ట్రేడింగ్ డెస్క్‌లో లక్షలాది రూపాయలు వ్యాపారం చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత పేద వ్యక్తిగా ముద్ర వేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి..

పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్

అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 10:15 PM