Share News

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడి చేసిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు

ABN , Publish Date - May 16 , 2025 | 09:57 PM

శుక్రవారంనాడు తీర్పు సందర్భంగా కోర్టుకు రష్దీ హాజరుకాలేదు. అయితే, తనపై జరిగిన దాడి ప్రభావంపై ఆయన కోర్టుకు సమాచారం ఇచ్చారు. రష్దీ హిపోక్రేట్ అని తీర్పుకు ముందు మతార్ అన్నారు.

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడి చేసిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు

న్యూయార్క్: ప్రముఖ అంతర్జాతీయ రచయిత, బుకర్ ప్రైక్ విజేత సల్మాన్ రష్దీ (Salman Rushdie)పై హత్యాయత్నం కేసులో శుక్రవారంనాడు తీర్పు వెలువడింది. ఈ కేసులో గత ఫిబ్రవరిలో దోషిగా నిరూపణ అయిన న్యూజెర్సీకి చెందిన 27 ఏళ్ల హాది మతార్‌ (Hadi Matar)కు కోర్టు 25 ఏళ్ల శిక్ష విక్ష విధించింది. న్యూయార్క్‌లో 2022లో జరిగిన దాడిలో సల్మాన్ రష్దీ కన్ను కోల్పోయారు.

India-Taliban Ties: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆప్ఘన్ సై..


శుక్రవారంనాడు తీర్పు సందర్భంగా కోర్టుకు రష్దీ హాజరుకాలేదు. అయితే, తనపై జరిగిన దాడి ప్రభావంపై ఆయన కోర్టుకు సమాచారం ఇచ్చారు. రష్దీ హిపోక్రేట్ అని తీర్పుకు ముందు మతార్ అన్నారు. 2022లో స్టేజిపై రష్దీతో పాటు మరో వ్యక్తిపై మతార్ దాడి చేశారు. రష్దీపై దాడికి 25 ఏళ్లు, మరో వ్యక్తిపై దాడికి 7 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జాసన్ ష్మిట్ తీర్పు చెప్పారు. ఈ రెండు శిక్షలూ ఏకకాలంలో అమలవుతాయి. మతార్ ఉద్దేశపూర్వకంగానే రష్దీపై 1400 మంది ఆడియెన్స్ ముందు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచినట్టు ష్మిట్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Pakistan: ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్‌కు లోన్.. S-400 ఆయుధాల కోసమేనా..

Saudi Arabia: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా

Updated Date - May 16 , 2025 | 10:03 PM