Male Humpback Dolphins: విగ్గులు పెట్టుకుంటున్న డాల్ఫిన్స్.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:15 PM
‘మేల్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు’ అంతరించి పోతున్న జాతిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువ ఉంది. వాటిని పరిరక్షించటం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.
బట్టతల వచ్చిన చాలా మంది మగాళ్లు విగ్గులను ఆశ్రయిస్తున్నారు. రియల్ హెయిర్‌కు ఏమాత్రం తీసిపోని విగ్గులు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే భయపడేవారు. లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టలేని వారు విగ్గులను ఆశ్రయిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. అచ్చం మనుషుల్లానే మగ డాల్ఫిన్లు కూడా విగ్గులు పెట్టుకుని తిరుగుతున్నాయి. మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియాలోని ఉత్తర తీరప్రాంతంలో ‘మేల్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు’(Male Humpback Dolphins)తమ తలలపై సముద్రపు స్పాంజీలను పెట్టుకుని తిరుగుతున్నాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ, కన్సర్వేషన్ అండ్ అట్రాక్షన్స్ (DBCA) పరిశోధకుల బృందం ఈ వింత ప్రవర్తనను గుర్తించింది. పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ డాల్ఫిన్లు ఇలా విగ్గులు పెట్టుకుని తిరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కారణం ఆడ డాల్ఫిన్లను ఆకర్షించటమే. పిల్బారా, కింబెర్లీ ప్రాంతాల్లోని (Sea Sponge Courtship) మగ డాల్ఫి్న్లు మాత్రమే ఇలా ఆడ డాల్ఫిన్లను ఆకర్షించడానికి సముద్రపు స్పాంజీని తలపై పెట్టుకుని తిరుగుతున్నాయి. కానీ, షార్క్ బే, మంకీ మియాలోని ఆడ డాల్ఫిన్లు మాత్రం విగ్గులను రక్షణ కోసం వాడుతున్నాయి.
సముద్రంలో గుంతలు తవ్వే సమయంలో రాళ్లు కోసుకుని గాయాలు కాకుండా ఉండేందుకు స్పాంజీని వాడుతున్నాయి. ఈ రక్షణ విద్యను అవి తమ పిల్లలకు కూడా నేర్పుతున్నాయి.(Dolphin Mating Behavior) డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ, కన్సర్వేషన్ అండ్ అట్రాక్షన్స్ టీం వీటికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ‘మేల్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్లు’ అంతరించి పోతున్న జాతిలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువ ఉంది. వాటిని పరిరక్షించటం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
దొంగతనం చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు..
ట్రెండింగ్: లవర్స్, పేరెంట్స్ కమిట్‌మెంట్‌ను లేడీస్ ఇలా చెక్ చేస్తున్నారు