Share News

యుద్ధం మొదలైంది మేం లొంగేది లేదు ఖమేనీ

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:17 AM

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలయ్యాక.. తొలిసారి ఆయన బహిరంగ ప్రకటన చేశారు.

యుద్ధం మొదలైంది మేం లొంగేది లేదు ఖమేనీ

ఇరాన్‌ లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలయ్యాక.. తొలిసారి ఆయన బహిరంగ ప్రకటన చేశారు. ఇరాన్‌ లొంగేది లేదని తేల్చిచెప్పారు. తమపై దాడితో ఇజ్రాయెల్‌ పెద్దతప్పు చేసిందని, దానికి ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే.. ఆ దేశానికి కోలుకోలేని దెబ్బతగులుతుంది. 7వ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్‌పై షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్ధం చేసి, ఘన విజయం సాధించారు. బెదిరింపులకు బయపడే చరిత్ర ఇరాన్‌కు లేదు. మేం బలంగా ప్రతిస్పందిస్తాం. ఎవరిపైనా దయ చూపేది లేదు’’ అని ఆయన ఓ పోస్టులో వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 19 , 2025 | 05:17 AM