Khalistan Diplomatic: కెనడాలో ఖలిస్థాన్ దౌత్యకార్యాలయం
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:59 AM
భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదాలు ఇప్పుడిప్పుడే సమసిపోతున్నాయన్న సంకేతాలు వస్తున్న
న్యూఢిల్లీ, ఆగస్టు 5: భారత్, కెనడాల మధ్య నెలకొన్న వివాదాలు ఇప్పుడిప్పుడే సమసిపోతున్నాయన్న సంకేతాలు వస్తున్న సమయంలో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థాన్ దౌత్యకార్యాలయం ఏర్పాటు ఇరు దేశాలపై మరోసారి తీవ్ర ప్రభావం చూపేలా చేసింది. ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలో ఉన్న గురునానక్ సిఖ్ గురుద్వారా ప్రాంతంలో ‘ఎంబసీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్థాన్’ పేరుతో నిజ్జర్ మద్దతు దారులు స్వతంత్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గురుద్వారాకు ఒకప్పుడు నిజ్జర్ నాయకత్వం వహించాడు. నిజ్జర్‌కు గుర్తుకుగానే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన మద్దతు దారులు ప్రకటించారు.