Katy Perry KissesTrudeau: పాప్ స్టార్‌కు మాజీ ప్రధాని ముద్దు..ఫోటో వైరల్
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:43 PM
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (53) పదవిలో లేనప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ కేటీ పెర్రీ(40)తో ట్రూడో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
నేటికాలంలో సెలబ్రిటీలకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వారి లవ్ ఎఫైర్స్ , ఇతర వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో(53)కు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆయన పాప్ స్టార్ పెర్రీకి ముద్దులు పెడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (53) (Justin Trudeau) పదవిలో లేనప్పటికీ ఏదో ఒక అంశంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ కేటీ పెర్రీ(40)(Katy Perry)తో ట్రూడో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ..తాజాగా వారిద్దరు ముద్దులు పెట్టుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలో ఓ బోటులో వారిద్దరు కిస్ చేసుకుంటూ కనిపించారు. ఇక వైరల్ అవుతోన్న ఫొటోలను చూసినట్లు అయితే పెర్రీ నల్లటి స్విమ్ సూట్‌లో ఉండగా.. షర్ట్ లేకుండా ట్రూడో ఉన్నారు. అంతేకాక వారిద్దరూ కౌగిలించుకుంటున్నారు. ట్రూడో.. పెర్రీ చెంపకు ముద్దు పెడుతున్నట్లు ఆ పిక్స్ లో కనిపిస్తుంది.
ఈ సన్నివేశాలను ఓ ప్రత్యక్ష సాక్షి చూసి..సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొలుత ట్రూడో, పెర్రీ(Katy Perry In Boat) ఉన్న బోటును దూరంగా చూసి.. దగ్గర వెళ్లిన తరువాత తాను ధృవీకరించుకున్నట్లు సదరు వ్యక్తి పేర్కొన్నారు. మొత్తంగా వారిద్దరి డేటింగ్ పుకార్లకు ఈ ఫొటోలు బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో జూలై 28న మోంట్రియాల్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు వెలుగులోకి రావడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే తొలుత వార్తలు వచ్చాయి. పెర్రీ(Katy Perry), యాక్టర్ ఓర్లాండో బ్లూమ్ తో ఏడేళ్లు కలిసి జీవించింది. అంతేకాక నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వివిధ కారణాలతో జూన్ 2025లో వారి నిశ్చితార్థం రద్దైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..
విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు