Lightning Drones: మేఘాలను ప్రేరేపించి..మెరుపులు పుట్టించే డ్రోన్
ABN , Publish Date - Apr 28 , 2025 | 05:12 AM
జపాన్ ఇంజనీర్లు, మెరుపుల నుంచి విద్యుత్ శక్తిని ఆకర్షించేందుకు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. రుణావేశిత మేఘాల నుంచి విద్యుత్ విడుదల చేసి, ఆ మెరుపును తమ అవసరాల ప్రకారం మళ్లించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. 2024 డిసెంబరులో భూమి నుంచి 984 అడుగుల ఎత్తులో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.
జపాన్ ఇంజనీర్ల ఘనత
పుట్టే మెరుపు నుంచి విద్యుత్‌శక్తిని ఒడిసిపట్టేందుకు ప్రయోగాలు
టోక్యో, ఏప్రిల్ 27: తివిరి ఇసుమున తైలము తీయవచ్చో లేదో గానీ.. ‘ఒడిసి మెరుపున విద్యుత్తు లాగుతాము’ అంటున్నారు జపాన్ ఇంజనీర్లు! రుణావేశిత (నెగెటివ్ చార్జ్) మేఘాలు భూమివైపు ఆకర్షితమై విద్యుత్‌శక్తిని విడుదల చేయడం వల్ల మెరుపులు పుడతాయి. వీటి వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 24 వేల మంది చనిపోతున్నట్టు అంచనా. అంతకు పది రెట్ల మంది గాయపడుతున్నారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవిస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటుంటాయి. అందుకే ఎత్తైన భవనాలు, నిర్మాణాల్లో.. పిడుగుపాటును తట్టుకునే కండక్టర్లను ఏర్పాటు చేస్తారు. అలాంటివి ఏర్పాటు చేయలేని క్రీడా మైదానాల వంటి చోట్ల పిడుగుపడితే? అలాంటి పిడుగుల వల్ల జపాన్‌లో ఏటా రూ.6-11 వేల కోట్ల దాకా ఆస్తినష్టం సంభవిస్తోంది. దీంతో ‘‘అలాంటి చోట్ల మేఘాలు విద్యుత్‌శక్తిని విడుదల చేసేదాకా ఆగడం? నష్టపోవడం దేనికి? రుణావేశిత మేఘాలు మోహరించినప్పుడు.. మెరుపులు పుట్టేలా ప్రేరేపించి.. అప్పుడు జనించే మెరుపును మనకు కావాల్సిన మార్గంలోకి మళ్లించి విద్యుత్తు లాగేద్దాం’’ అని జపాన్‌కు చెందిన ‘నిహోన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్‌టీటీ) ఇంజనీర్లు అనుకున్నారు. ఆ దిశగా తీవ్ర పరిశోధనలు చేసి ఓ డ్రోన్‌ను రూపొందించారు. అది మేఘాలకు సమీపంలోకి వెళ్లి రుణావేశిత మేఘాలను గుర్తించి, విద్యుత్తు క్షేత్రాల్లో హెచ్చుతగ్గులు సృష్టించడం ద్వారా ఆ మేఘం విద్యుత్‌శక్తిని విడుదల చేసేలా (మెరుపును పుట్టించేలా) చేస్తుంది. 2024 డిసెంబరు 13న ఒక డ్రోన్ సాయంతో భూమి నుంచి 984అడుగుల ఎత్తున ఒక మేఘాన్ని ప్రేరేపించి మెరుపు పుట్టేలా చేశారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చే సి.. మెరుపు నుంచి విద్యుత్ శక్తిని ఒడిసిపట్టేలా కృషి చేస్తున్నట్టు ఎన్‌టీటీ ఇంజనీర్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News