Share News

Giorgia Meloni: మోదీ, ట్రంప్‌, నేను మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:06 AM

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీ వంటి నాయకులు కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నొక్కిచెప్పారు.

Giorgia Meloni: మోదీ, ట్రంప్‌, నేను మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు

ఉదారవాదులవి ద్వంద్వ ప్రమాణాలు

వారి అబద్ధాల్ని ప్రజలు నమ్మట్లేదు: ఇటలీ ప్రధాని మెలోనీ

ప్రపంచ వ్యాప్తంగా ఉదారవాదులు ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రదాని జార్జియా మెలోనీ ఆరోపించారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీ వంటి నాయకులు కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నొక్కిచెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలు ఆందోళనలో ఉన్నాయని, ట్రంప్‌ విజయంతో వారి చిరాకు ఉన్మాదంగా మారిందని ఎద్దేవా చేశారు. 90వ దశకంలో టోనీ బ్లెయిర్‌, బిల్‌ క్లింటన్‌లు వామపక్ష ఉదారవాద నెట్‌వర్క్‌ను సృష్టించినప్పుడు ఉదారవాదులు వారిని రాజనీతిజ్ఞులుగా పిలిచేవారని మెలోనీ గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం మోదీ, ట్రంప్‌, మెలోనీ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంటున్నారని మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:06 AM