Share News

Israel: పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌లోకి ఇజ్రాయెల్‌ ట్యాంకులు

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:21 AM

గాజా ప్రాంతంలో కాల్పులు విరమణ కుదిరినప్పటికీ, తాజాగా పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్‌బ్యాంక్‌లో యుద్ధం ఆరంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆదివారం ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ ట్యాంకులు వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌కు వెళ్లాయి. 2002 తరువాత ఇజ్రాయెల్‌ ట్యాంకులు వెస్ట్‌బ్యాంక్‌కు వెళ్లడం ఇదే ప్రథమం.

Israel: పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌లోకి ఇజ్రాయెల్‌ ట్యాంకులు

జెనిన్‌ (వెస్ట్‌బ్యాంక్‌), ఫిబ్రవరి 23: పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య మళ్లీ యుద్ధం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గాజా ప్రాంతంలో కాల్పులు విరమణ కుదిరినప్పటికీ, తాజాగా పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్‌బ్యాంక్‌లో యుద్ధం ఆరంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆదివారం ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ ట్యాంకులు వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌కు వెళ్లాయి. 2002 తరువాత ఇజ్రాయెల్‌ ట్యాంకులు వెస్ట్‌బ్యాంక్‌కు వెళ్లడం ఇదే ప్రథమం. ఈ ఏడాదంతా దళాలు అక్కడే ఉంటాయని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇస్రాయెల్‌ కాట్జ్‌ పక్రటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటించిన రెండు రోజులకే జనవరి 21న వెస్ట్‌బ్యాంక్‌ ఉత్తర ప్రాంతంలో దాడులు ప్రారంభించింది. ఇక్కడ సుమారు 40వేల మంది శరణార్థులు తలదాల్చుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 05:21 AM