Israel Vs Iran: ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్..
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:18 PM
ఇజ్రాయెల్‌పై వందలాది బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ గురువారం ప్రయోగించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని సొరాకాలో అతిపెద్ద ఆసుపత్రిని తాకాయి. దీంతో పలు విభాగాలు ధ్వంసమైనాయి.
టెల్ అవీవ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గురువారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా బాలిస్టిక్స్ క్షిపణులు ప్రయోగించింది. ఇవి దక్షిణ ఇజ్రాయెల్‌లోని సొరొకలో ఆసుపత్రిని తాకాయి. దీంతో ఆ ఆసుపత్రిలోని పలు భాగాలు ధ్వంసమైనాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. ఈ దాడిలో ఆసుపత్రిలోని పలు విభాగాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అలాగే పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. మొన్నటి వరకు ఈ ఆసుపత్రిలో రోగులు భారీ సంఖ్యలో ఉన్నారని.. వారిని నిన్ననే మరో ప్రాంతానికి తరలించామని చెప్పారు. అందువల్లే ఎవరూ మృతి చెందలేదని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రిని ప్రస్తుతానికి మూసి వేసినట్లు ప్రకటించారు.
అయితే అత్యవసర కేసులను మాత్రమే పరిశీలిస్తున్నాని.. కొత్త రోగులు ఎవరిని ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదని సిబ్బంది వివరించారు. మరోవైపు ఇరాన్ దాడుల నేపథ్యంలో దేశంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని రక్షించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని.. అండర్ గ్రౌండ్‌లోకి, అలాగే పార్కింగ్ ప్రాంతాలకు తరలించి.. వారికి చికిత్స అందిస్తున్నారు.
వందలాది క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఎయిర్ డిఫెన్ బేస్‌లను సైతం ఇజ్రాయెల్ మూసి వేసింది. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టేందుకు చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఇక ఇజ్రాయెల్ మద్దతుగా అమెరికా సైతం రంగంలోకి దిగనుంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా సైతం దాడులు చేసేందుకు సమాయత్తమవుతోంది.
ఈ వార్తలు కూడ చదవండి..
విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్..!
విద్యార్థులు విన్నపం.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం
For National News And Telugu News