Share News

Fraud: అమెరికాలో ఎంబసీ పేరుతో వచ్చే కాల్స్‌తో జాగ్రత్త!

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:23 AM

ఎంబసీ పేరిట వచ్చే తప్పుడు ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికాలోని భారతీయులకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం అడ్వైజరీ విడుదల చేసింది.

Fraud: అమెరికాలో ఎంబసీ పేరుతో వచ్చే కాల్స్‌తో జాగ్రత్త!

వాషింగ్టన్‌, మార్చి 12: ఎంబసీ పేరిట వచ్చే తప్పుడు ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికాలోని భారతీయులకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం అడ్వైజరీ విడుదల చేసింది. పాస్‌పోర్టు, వీసా ఫామ్‌, ఇమిగ్రేషన్‌ పత్రాల్లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దడం కోసం పెనాల్టీ లేక ఫీజులు చెల్లించాలంటూ డబ్బు గుంజే పనులు మోసగాళ్లు చేస్తుంటారని తెలిపింది.


అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం తన దేశం నుంచి గెంటివేస్తున్న (డిపోర్టేషన్‌) విషయం తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకుని మోసగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా విద్యాశాఖలో ఇప్పుడు పనిచేస్తున్నవారిలో కనీసం సగం మంది(2,183)ని తొలగించనున్నట్లు అమెరికా విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మోహన్‌ వెల్లడించారు.

Updated Date - Mar 13 , 2025 | 06:23 AM