Share News

India US Deal: గుడ్ న్యూస్.. త్వరలో భారత్–అమెరికా మధ్య అతిపెద్ద వాణిజ్య ఒప్పందం

ABN , Publish Date - Jun 27 , 2025 | 08:37 AM

త్వరలో భారత్‌తో అమెరికా బిగ్ డీల్ (India US Deal) కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం విశేషం. తాజాగా చైనాతో డీల్ చేసుకున్న క్రమంలో ట్రంప్ తెలిపారు.

India US Deal: గుడ్ న్యూస్.. త్వరలో భారత్–అమెరికా మధ్య అతిపెద్ద వాణిజ్య ఒప్పందం
India US Deal

ఇండియాకు గుడ్ న్యూస్ రాబోతుంది. భారత్‌ త్వరలో అమెరికాతో చాలా పెద్ద ఒప్పందం (India US Deal) కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనాతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ ప్రతి ఒక్కరూ తమతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. కానీ అన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోబోమని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్‌తో ఒక పెద్ద ఒప్పందం రాబోతోందని, ప్రతి దేశంతో సంబంధాలు చాలా మంచి స్థితిలో ఉన్నాయన్నారు.


చైనా డీల్ దేనికోసం..

ఈ క్రమంలో చైనా ఒప్పందం విషయాలను మాత్రం ట్రంప్ వివరించలేదు. కానీ వైట్ హౌస్ అధికారులు తెలిపిన ప్రకారం ఈ ఒప్పందం చైనాలో అరుదైన భూముల బదిలీ విషయంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇది చైనాలో కీలక ఖనిజాలైన మాగ్నెట్లపై ఉన్న పరిమితుల కారణంగా ఏర్పడిన ఆలస్యం పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. ఇది అమెరికా పరిశ్రమలను ముఖ్యంగా ఆటోమోటివ్, రక్షణ, సాంకేతిక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతోపాటు చైనా జెనీవా ఒప్పందాన్ని అమలు చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌పై డీల్ కుదుర్చుకుందని వెల్లడించారు.


ట్రేడ్ డీల్

ఈ క్రమంలో చైనా మాకు అరుదైన భూములను అందించబోతుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. వారు మాకు సరఫరా చేస్తే, మేము వారి ప్రతిఘటనలను తీసేస్తామని ఆయన అన్నారు. జెనీవా చర్చలు, చైనా ఎగుమతి పరిమితులు, అమెరికా ఆంక్షల కారణంగా ఇవి మొదట నిలిచిపోయాయన్నారు. కానీ ఇటీవల చర్చల తర్వాత స్థిరమైన వాణిజ్య ఫ్రేమ్‌వర్క్ రూపొందించుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా-చైనా మధ్య ఒప్పందం ఖరారైందన్నారు. దీంతో అమెరికా, చైనా మధ్య ఎగుమతుల పరిమితులు సులభతరం కానున్నాయి.


ఇప్పటికే చర్చలు..

ఈ నెల ప్రారంభంలో అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడారు. ఆ సమయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో జరుగుతుందన్నారు. మేము చాలా మంచి స్థితిలో ఉన్నామని, త్వరలోనే అమెరికా, భారత్ మధ్య ఒప్పందాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది రెండు దేశాలకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. అమెరికా-చైనా తాజా ఒప్పందం నేపథ్యంలో భారత్‌తో డీల్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.


ఇవీ చదవండి:

భారత్, ఇంగ్లాడ్ టెస్ట్‌ల మధ్య జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి..

జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 01:46 PM