Share News

IMF Pakistan bailout: భారత్‌తో ఉద్రిక్తతలుంటే కష్టమే

ABN , Publish Date - May 19 , 2025 | 04:47 AM

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు IMF కొత్తగా 11 షరతులు విధించింది. భారత్‌తో ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక లక్ష్యాలకు ముప్పు అని IMF హెచ్చరించింది.

IMF Pakistan bailout: భారత్‌తో ఉద్రిక్తతలుంటే కష్టమే

బెయిల్‌ అవుట్‌ లక్ష్యాలకు ముప్పు

పాక్‌కు ఐఎంఎఫ్‌ హెచ్చరిక

ఇస్లామాబాద్‌, మే 18: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌కు తదుపరి నిధుల మంజూరుపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల విషయంలో పాక్‌కు హెచ్చరిక చేయడంతోపాటు కొత్తగా 11 షరతులు విధించింది. బెయిల్‌ అవుట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా తదుపరి విడత నిధులు విడుదల చేయాలంటే ఇవి పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. భారత్‌లో ఉద్రిక్తతలు ప్రోగ్రామ్‌ ఆర్థిక, బాహ్య, సంస్కరణల లక్ష్యాలకు ముప్పు పెంచుతాయని ఐఎంఎఫ్‌ హెచ్చరించిందని ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వార్తాపత్రిక ఆదివారం నివేదించింది. పాకిస్థాన్‌కు విధించిన షరతుల్లో రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంటరీ ఆమోదం, విద్యు త్తు బిల్లులపై రుణ సేవల సర్‌చార్జి పెంపు, మూడేళ్లకుపైగా వినియోగించిన కార్ల దిగుమతిపై ఆంక్షల తొలగింపువంటివి ఉన్నాయి.


ఈమేరకు ఐఎంఎఫ్‌ శనివారం స్టాఫ్‌ లెవల్‌ రిపోర్టును విడుదల చేసింది. ‘భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు అలాగే కొనసాగినా, పరిస్థితి మరింత దిగజారినా.. అది బెయిల్‌ అవుట్‌ ప్రోగ్రామ్‌ ఆర్థిక, బాహ్య, సం స్కరణ లక్ష్యాలకు ముప్పును పెంచుతుంది’ అని పేర్కొంది. తాజా నిబంధనలతో పాక్‌పై ఐఎంఎఫ్‌ విధించిన షరతుల సంఖ్య 50కి చేరింది. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలను ఐఎంఎఫ్‌ తన నివేదికలో ప్రస్తావించింది. అయితే మార్కెట్‌ ప్రతిస్పందన నియంత్రణలోనే ఉందని పేర్కొంది. వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో రక్షణ బడ్జెట్‌ రూ.2.414 ట్రిలియన్లుగా ఉందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 12శాతం పెంపు అని తెలిపింది. ఐఎంఎఫ్‌ అంచనాలతో పోలిస్తే.. భారత్‌తో ఘర్షణల నేపథ్యంలో రక్షణ రంగానికి రూ.2.5 ట్రిలియన్లు అధికంగా కేటాయిస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం సూచించింది.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:48 AM