Netanyahu: ట్రంప్‌ను ఎలా డీల్ చేయాలో మోదీకి చెబుతా
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:07 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి చెబుతానని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి చెబుతానని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ పేర్కొన్నారు. భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంపై స్పందిస్తూ.. ‘‘ఈ విషయంలో భారత్, యూఎస్ ఒక అవగాహనకు రావాలి. మోదీ, ట్రంప్ ఇద్దరూ నాకు మంచి మిత్రులు. ట్రంప్‌తో ఎలా డీల్ చేయాలో మోదీకి చెబుతా. కాకపోతే వ్యక్తిగతంగా కలిసినప్పుడు..’’ అని నెతన్యాహూ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో ఇజ్రాయెల్ ఆయుధాలను భారత్ ప్రయోగించిందని.. అవన్నీ చాలా బాగా పనిచేశాయని పేర్కొన్నారు. భారత్‌కు గగనతల నిఘా వ్యవస్థలు అందించేందుకు సిద్ధమని తెలిపారు.