Share News

France: 25 ఏళ్లలో 299 మంది పిల్లలపై అత్యాచారం

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:21 AM

దాదాపు 25 ఏళ్ల కాలంలో 299 మందిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో జోయల్‌ లె స్కౌర్నెక్‌ (74)పై స్థానిక కోర్టులో విచారణను ప్రారంభించారు. 1989 నుంచి 2014 వరకు 158 మంది బాలురు, 141 మంది బాలికలపై రేప్‌ చేసినట్టు పోలీసుల కేసు నమోదు చేశారు.

France: 25 ఏళ్లలో 299 మంది పిల్లలపై అత్యాచారం

వన్నెస్‌, ఫిబ్రవరి 25: చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన పిల్లలపై అత్యాచారం చేశాడంటూ ఫ్రాన్స్‌లోని వన్నె్‌సలో సోమవారం ఓ వృద్ధ వైద్యునిపై విచారణ ఆరంభమయింది. దాదాపు 25 ఏళ్ల కాలంలో 299 మందిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో జోయల్‌ లె స్కౌర్నెక్‌ (74)పై స్థానిక కోర్టులో విచారణను ప్రారంభించారు. 1989 నుంచి 2014 వరకు 158 మంది బాలురు, 141 మంది బాలికలపై రేప్‌ చేసినట్టు పోలీసుల కేసు నమోదు చేశారు. బాధితుల సగటు వయసు 11 ఏళ్లని పేర్కొన్నారు. ఆస్పత్రి గదుల్లో వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దారుణానికి పాల్పడినట్టు ఆధారాలను సమర్పించారు. తనను అనుచిత రీతిలో తాకాడంటూ 2017లో పొరుగింటికి చెందిన ఆరేళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైద్యుడు కూడా నేరాలను అంగీకరించాడు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 05:21 AM