Biden prostate cancer: జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. రేడియేషన్ థెరపీ పూర్తి..
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:00 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ కేన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ చికిత్సను పూర్తి చేశారని ఆయన ప్రతినిధి తెలిపారు. బై డెన్ ఫిలడెల్ఫియాలోని పెన్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీలో చికిత్స పొందుతున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ చికిత్సను పూర్తి చేశారని ఆయన ప్రతినిధి తెలిపారు. బైడెన్ ఫిలడెల్ఫియాలోని పెన్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీలో చికిత్స పొందుతున్నారు. డెమొక్రాట్ పార్టీకి చెందిన బైడెన్ 82 ఏళ్ల వయసులో ఈ ఏడాది జనవరిలో తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు (Biden health update).
ఈ ఏడాది మే నెలలో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ క్యాన్సర్ ఎముకలకు కూడా వ్యాపించిందని అతడి ప్రతినిధులు తెలిపారు. బైడెన్ మూత్ర సంబంధిత లక్షణాలను పరీక్షించి అతడి క్యాన్సర్‌ను నిర్ధారణ చేశారు. సాధారణంగా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గ్లీసన్ స్కోర్ ఉపయోగించి ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు (Biden radiation therapy).
గ్లీసన్ స్కోర్ 6 నుంచి 10 వరకు లెక్కించి క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. కాగా, బైడెన్ గ్లీసన్ స్కోరు 9 అని అతడి ప్రతినిధులు వెల్లడించారు (prostate cancer treatment). కాగా, గత నెలలో నుదిటి నుంచి చర్మ క్యాన్సర్ కణాలను తొలగించడానికి బైడెన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ముహూరత్ ట్రేడింగ్ ఏ రోజు, ఎప్పుడు.. పూర్తి వివరాలు మీ కోసం..
దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..