Share News

200 Payment For Abortion Pills: కొంపముంచిన ఆన్‌లైన్ పేమెంట్.. భర్త ఎఫైర్ బట్టబయలు..

ABN , Publish Date - Aug 22 , 2025 | 08:53 PM

200 Payment For Abortion Pills: ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేశాడు. సిస్టమ్‌లో ఎర్రర్ కారణంగా పేమెంట్ ఫెయిల్ అయింది. ఫార్మసీ సిబ్బంది మెంబర్‌షిప్ కార్డుతో లింక్ అయి ఉన్న అతడి నెంబర్‌కు కాల్ చేశారు.

200 Payment For Abortion Pills: కొంపముంచిన ఆన్‌లైన్ పేమెంట్.. భర్త ఎఫైర్ బట్టబయలు..
200 Payment For Abortion Pills

ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైపోయాయి. దాదాపు 70 శాతం మంది ఆన్‌లైన్ పేమెంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ల కారణంగా జేబిలో డబ్బులు పెట్టుకుని తిరగాల్సిన శ్రమ తప్పిపోయింది. అయితే, కొన్ని సార్లు ఆన్‌లైన్ పేమెంట్ల వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. టెక్నికల్ సమస్యల కారణంగా పేమెంట్లు ఫెయిల్ అవుతున్నాయి. అన్ని సార్లు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, ఓ వ్యక్తి కాపురం ఆన్‌లైన్ పేమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల నాశనం అయింది.


అతడి ఎఫైర్ గురించి భార్యకు తెలిసి పోయింది. అడ్డంగా బుక్కైపోయాడు. ఇంతకీ సంగతేంటంటే.. చైనా, గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యాంజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అతడు వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. తరచుగా ఆమెతో ఏకాంతంగా కలుస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గర్భం రాకుండా ఉండేందుకు ఆమెకు పిల్స్ కొనిస్తూ ఉన్నాడు. ఓ రోజు బర్త్ కంట్రోల్ పిల్స్ కొనడానికి ఫార్మసీ షాపుకు వెళ్లాడు. 15.8 యువాన్లు.. ఇండియన్ కరెన్సీలో అయితే, 200రూపాయలు పెట్టి పిల్స్ కొన్నాడు.


ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేశాడు. సిస్టమ్‌లో ఎర్రర్ కారణంగా పేమెంట్ ఫెయిల్ అయింది. ఫార్మసీ సిబ్బంది మెంబర్‌షిప్ కార్డుతో లింక్ అయి ఉన్న అతడి నెంబర్‌కు కాల్ చేశారు. అనుకోకుండా ఆ వ్యక్తి భార్య కాల్ లిఫ్ట్ చేసింది. పేమెంట్ గురించి ఎంక్వైరీ చేసింది. వాళ్లు అసలు విషయం చెప్పారు. దీంతో ఆమె షాక్ అయింది. ఈ విషయంపై భర్తను నిలదీసింది. ఇద్దరి మధ్యా గొడవ జరిగి విడిపోయారు. భార్య తనకు దూరం కావడానికి ఫార్మసీ వాళ్లే కారణం అంటూ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పట్టుమని పదేళ్లు లేవు.. నాలుగు అడుగుల పాము చేత్తో పట్టి..

కూకట్‌పల్లి బాలిక కేసు.. డాడీ డాడీ అని అరుస్తుండగానే..

Updated Date - Aug 22 , 2025 | 08:55 PM