Ukraine: ఉక్రెయిన్‌కు ఈయూ అండ
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:45 AM
‘‘ఉక్రెయిన్‌పై రష్యాది దురాక్రమణ’’ అని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌కు నాటో అత్యుత్తమ భద్రత హామీలనిస్తుందని.. ట్రంప్ రష్యా మాటలకు లొంగిపోయారని ఈయూ విదేశీ వ్యవహారాల ఉన్నత ప్రతినిధి ఖాజాకల్లాస్ అన్నారు. ఈయూ అధ్యక్షుడు ఉర్సులా లెయాన్ కూడా ‘‘ప్రియమైన జెలెన్‌స్కీ.. మీకు అండగా మేమున్నాం.
అదే బాటలో కెనడా.. ట్రంప్-జెలెన్‌స్కీ వాగ్వాదం నేపథ్యంలో అండగా ఉంటామని పోస్టులు
ఉక్రెయిన్‌కు నాటో భద్రత.. అమెరికాకు సామంతురాలిగా ఇకపై ఈయూ ఉండొద్దు
ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ సూచన.. రష్యాది దురాక్రమణ: కెనడా
ఉక్రెయిన్ ఒంటరిగా లేదు: పోలాండ్.. నేడు బ్రిటన్‌లో ఐరోపా నేతల సదస్సు
కీవ్, మార్చి 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఓవెల్ ఆఫీస్ జరిగిన చర్చలు విఫలమవ్వడంతో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి తాము అండగా ఉంటామంటూ ఐరోపా దేశాలు ముక్తకంఠంతో ప్రకటించాయి. కెనడా కూడా ఉక్రెయిన్‌కు తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది. ‘‘ఉక్రెయిన్‌పై రష్యాది దురాక్రమణ’’ అని వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌కు నాటో అత్యుత్తమ భద్రత హామీలనిస్తుందని.. ట్రంప్ రష్యా మాటలకు లొంగిపోయారని ఈయూ విదేశీ వ్యవహారాల ఉన్నత ప్రతినిధి ఖాజాకల్లాస్ అన్నారు. ఈయూ అధ్యక్షుడు ఉర్సులా లెయాన్ కూడా ‘‘ప్రియమైన జెలెన్‌స్కీ.. మీకు అండగా మేమున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీతో మేము కలిసి పనిచేస్తాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏకంగా ఐరోపా దేశాలు అమెరికాకు సామంత పాత్రను వీడాలని పిలుపునిచ్చారు.
ట్రంప్‌నకు సన్నిహితంగా ఉండే ఇటలీ ప్రధాని మెలోనీ కూడా ఎక్స్‌లో ఓ పోస్టు చేస్తూ.. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామన్నారు. ఉక్రెయిన్ ఒంటరి కాదని పోలాండ్ మద్దతు పలికింది. కాగా.. అమెరికా మద్దతు తగ్గడంతో ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆర్థికసాయాన్ని నిలిపివేసినట్లు ఐరాస తెలిపింది. మరోవైపు, ఆదివారం బ్రిటన్‌లో ఈయూ నేతల సదస్సు జరగనుండడంతో.. జెలెన్‌స్కీ అమెరికా నుంచి నేరుగా లండన్‌కు చేరుకున్నారు. నిజానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ఎజెండాల్లో ఉక్రెయిన్‌కు మద్దతిస్తూ.. యుద్ధాన్ని నిలిపివేసి, శాంతిని నెలకొల్పడం ఒకటిగా ఉంది. సదస్సులో జెలెన్‌స్కీ ప్రసంగిస్తారని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ తదితర దేశాధినేతలతోనూ జెలెన్‌స్కీ వేర్వేరుగా భేటీకానున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.