Musk DOGE Budget Cut: భారత్‌కు అమెరికా ఇచ్చే నిధుల్లో ఎలాన్ మస్క్ కోత
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:34 PM
భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధుల్లో అమెరికా కోత పెట్టింది. ఈ మేరకు మస్క్ సారథ్యంలోని డోజ్ శాఖ ఎక్స్ వేదికగా వెల్లడించింది. భారత్‌తో పాటు పలు దేశాలకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు ట్రంప్ సర్కార్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖ పలు దేశాలకు ఇస్తున్న నిధుల్లో తాజాగా భారీ కోత పెట్టింది. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్లను రద్దు చేసినట్టు పేర్కొంది. దీంతో పాటు బాంగ్లాదేశ్‌లో రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం కోసం ఉద్దేశించిన 29 మిలియన్ డాలర్ల నిధులను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు డోజ్ శాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
‘‘అమెరికా పన్ను చెల్లింపుదార్ల డబ్బు ఇప్పటివరకూ పలు ప్రాజెక్టులకు మళ్లించేవారు. వాటన్నిటినీ రద్దు చేస్తున్నాం’’ అని ఎలాన్ మస్క్ సారథ్యంలోని డోజ్ శాఖ పేర్కొంది (USA).
Donald Trump: ఉద్యోగ యంత్రాంగంలో ఊచకోతలే!
అమెరికా ఇప్పటివరకూ పలు అంతర్జాతీయ ప్రాజెక్టులు, ప్రజాస్వామ్యం బలోపేతం చేసే కార్యక్రమాలను నిధులు అందజేస్తోంది. అయితే, ఖర్చులు తగ్గించే క్రమంలో డోజ్ శాఖ ఈ నిధులకు కత్తెర వేసేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం అమెరికా చేస్తున్న ఖర్చులను తగ్గించుకోకపోతే దివాళా తీస్తామని ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌కు కేటాయించిన 29 మిలియన్ డాలర్ల నిధులకు కూడా కోత పెట్టారు.
కాగా, డోజ్ శాఖ నిర్ణయంపై బీజేపీ నేత అమిత్ మాల్వీయ స్పందించారు. ఎన్నికలు, రాజకీయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న కన్సార్షియంకు అందించే 486 మిలియన్ డాలర్ల నిధుల్లో కోత పెట్టారట. ఇందులో భారత్ కూడా 21 మిలియన్ డాలర్లు ఇచ్చేవారట. ఓటింగ్ శాతం పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల. ఇది కచ్చితంగా భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే’’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
Zelensky: ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయి: ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఇదిలా ఉంటే, మస్క్ పనితీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మస్క్ సారథ్యంలోని డోజ్ శాఖ కారణంగా బిలియన్ల డాలర్లు పొదుపు చేయగలిగామని అన్నారు. దాదాపు 500 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉందని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి