Share News

SpaceX Dragon spacecraft: డ్రాగన్‌ అన్‌డాకింగ్‌ విజయవంతం

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:05 AM

యాక్సియం 4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్‌ఎస్‌ వెళ్లిన భారత వ్యోమగామి శాభాన్షు శుక్లా..

SpaceX Dragon spacecraft: డ్రాగన్‌ అన్‌డాకింగ్‌ విజయవంతం

  • 18 రోజుల తర్వాత నేడు భూమిపైకి శుభాన్షు శుక్లా

న్యూఢిల్లీ, జూలై 14: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌ ) వెళ్లిన భారత వ్యోమగామి శాభాన్షు శుక్లా.. 18 రోజుల తర్వాత భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. శాభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు మంగళవారం భూమిపైకి చేరుకోనున్నారు. ఐఎ్‌సఎస్‌ నుంచి నలుగురు వ్యోమగాముల బృందాన్ని తీసుకొస్తున్న డ్రాగన్‌ వ్యోమనౌక.. అన్‌డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అక్కడి నుంచి దాదాపు 22 గంటల ప్రయాణం అనంతరం ఈ వ్యోమనౌక మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగనుంది. సోమవారం మధ్యాహ్నం 2:37 గంటలకు కమాండర్‌ పెగ్గీ విట్సన్‌, మిషన్‌ పైలట్‌ శాభాన్షు శుక్లా, మిషన్‌ స్పెషలిస్టులు స్లావోజ్‌ ఉజ్నాన్‌స్కీ-విస్నియెస్కీ, టిబోర్‌ కాపు.. ఐఎ్‌సఎస్‌ నుంచి ‘డ్రాగన్‌’లోకి ప్రవేశించారు. కాగా, ఐఎ్‌సఎ్‌సలో ఉన్న నాసా బృందం ఆదివారమే వీరికి వీడ్కోలు వేడుక నిర్వహించింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శాభాన్షు బృందం గత నెల 25న స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌లో అంతరిక్షంలోకి బయల్దేరింది. 28 గంటల ప్రయాణం అనంతరం ఐఎ్‌సఎ్‌సలోకి ప్రవేశించింది. ఈ బృందం అక్కడే 18 రోజులుండి పలు ప్రయోగాలు చేసింది.

Updated Date - Jul 15 , 2025 | 05:06 AM