Share News

Barack Obama: ఖమేనీ ముందు ఒబామా తలవంచాడా.. ఆ ఫొటోలో నిజం ఎంత..

ABN , Publish Date - Jun 25 , 2025 | 09:08 PM

Barack Obama: ఒకప్పుడు అమెరికా, ఇరాన్ మిత్ర దేశాలు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలైంది కూడా అమెరికా కారణంగానే. 1979 వరకు ఇరాన్, అమెరికా ఎంతో అన్యోన్యంగా ఉండేవి.

Barack Obama: ఖమేనీ ముందు ఒబామా తలవంచాడా.. ఆ ఫొటోలో నిజం ఎంత..
Barack Obama

గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. కొన్ని రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో న్యూక్లియర్ సైట్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇరాన్ కూడా తగ్గేదేలా అన్నట్లు సిరియాలోని అమెరికా మిలటరీ బేస్‌పై మొన్న దాడి చేసింది. ఇలా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


ఆ ఫొటోలో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా .. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ముందు తల వంచాడు. అయితే, ఆ ఫొటో ఫేక్ అని తేలింది. రెండు ఫోటోలను కలిపి దాన్ని తయారు చేసినట్లు బయటపడింది. బిల్ మెక్‌కార్తీ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఓ ఫొటోలో ఒబామా ఓ చిన్న పిల్లాడి ముందు తలవంచి నిల్చున్నాడు. ఆ పిల్లాడు ఒబామా తల పట్టుకున్నాడు. మరో ఫొటోలో ఖమేనీ తనకు నమస్కరించిన వ్యక్తి వైపు తిరిగి ఉన్నారు.


ఈ రెండు ఫొటోలను కలిపి ఖమేనీ, ఒబామా కలిసి ఉన్నట్లుగా.. ఖమేనీ ముందు ఒబామా తలదించినట్లుగా ఫేక్ ఫొటో తయారు చేశారు. కాగా, ఒకప్పుడు అమెరికా, ఇరాన్ మిత్ర దేశాలు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలైంది కూడా అమెరికా కారణంగానే. 1979 వరకు ఇరాన్, అమెరికా ఎంతో అన్యోన్యంగా ఉండేవి. 1979లో ఆయతుల్లా ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మరింత దిగజారాయి. దాడులు చేసుకునే వరకు వచ్చాయి.


ఇవి కూడా చదవండి

చదవటం లేదని శిక్ష.. ఊహించని నిర్ణయం తీసుకున్న బాలిక

ప్లేటు ఫిరాయించిన అమెరికా.. అప్పుడు సాయం.. ఇప్పుడు దాడులు

Updated Date - Jun 25 , 2025 | 09:55 PM