Share News

Irans Nuclear Program: ప్లేటు ఫిరాయించిన అమెరికా.. అప్పుడు సాయం.. ఇప్పుడు దాడులు

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:05 PM

Irans Nuclear Program: 1979లో షా పదవి కోల్పోయాడు. అయతుల్లా ఖొమేనీ అధికారంలోకి వచ్చాడు. అమెరికాతో ఉన్న సంబంధాలకు ముగింపు పలికాడు. 40 ఏళ్లలో రెండు దేశాల మధ్య ఓ అగాథం ఏర్పడింది.

Irans Nuclear Program: ప్లేటు ఫిరాయించిన అమెరికా.. అప్పుడు సాయం.. ఇప్పుడు దాడులు
Irans Nuclear Program

‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు’ అన్నది అమెరికా, ఇరాన్ బంధం విషయంలో నూటికి నూరు శాతం నిజమైంది. ఇరాన్ న్యూక్లియర్ బాంబుల తయారీ కథ అమెరికా కారణంగా మొదలైంది. బాంబుల తయారీ కోసం అవసరమైన యురేనియంను స్వయంగా అమెరికానే కొన్నేళ్ళ పాటు సప్లై కూడా చేసింది. ఇరాన్‌లో అధికార మార్పుతో అమెరికాతో మైత్రి దెబ్బతింది. డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడులు చేసే వరకు పరిస్థితి వచ్చింది.


1957లో మొదలైన కథ..

1957లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సివిల్ న్యూక్లియర్ కోపరేషన్ అగ్రిమెంట్ జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ ఈసెన్‌హెవర్ తీసుకొచ్చిన ‘ఆటమ్స్ ఫర్ ఫీస్’ కార్యక్రమం కింద ఈ బప్పందం జరిగింది. టెహ్రాన్‌లో మొదటి న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం మొదలైంది. సరిగ్గా పదేళ్ల తర్వాత.. 1967లో టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. ఆయుధాల కోసం ఉపయోగించే యూరేనియాన్ని స్వయంగా అమెరికా సప్లై చేసేది. 1970 నాటికి షా మహ్మద్ రెజా పహ్లావీ నాయకత్వంలోని ఇరాన్‌తో అమెరికా మైత్రి మరింత మెరుగుపడింది


న్యూక్లియర్ బాంబుల తయారీ పనులు కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ సొంతంగా యూరేనియం సేకరించడానికి, దాన్ని శుద్ధి చేయడానికి అమెరికా మద్దతు కూడా ఇచ్చింది. 1979లో షా పదవి కోల్పోయాడు. అయతుల్లా ఖొమేనీ అధికారంలోకి వచ్చాడు. అమెరికాతో ఉన్న సంబంధాలకు ముగింపు పలికాడు. 40 ఏళ్లలో రెండు దేశాల మధ్య ఓ అగాథం ఏర్పడింది. ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లు ఫోర్దో, నతాంజ్‌లు వివాదాస్పదంగా మారిపోయాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతకు దారి తీశాయి.


ఈ నేపథ్యంలోనే 2015లో ఇరాన్‌ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు ఊరటనిచ్చేలా.. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలైంది. ఈ జేసీపీఓఏకు అమెరికా కూడా మద్దతునిచ్చింది. అయితే, 2018లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ఉపసంహరించుకున్నాడు. దీంతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి.


ఇవి కూడా చదవండి

ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐటీ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ డెసిషన్..

వీడు మామూలోడు కాదు.. ప్రాణం కంటే తిండే ఎక్కువైంది..

Updated Date - Jun 25 , 2025 | 07:51 PM