Hong Kong Apartment Fire: మృతదేహాల దిబ్బగా భవన సముదాయం
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:05 AM
హాంకాంగ్‌లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో నెలకొన్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో లారెన్స్ లీ అనే బాధితుడు వ్యక్తం చేసిన ఆవేదన ఇది...
హాంకాంగ్ అగ్ని ప్రమాద ఘటనలో 83కు పెరిగిన మృతుల సంఖ్య
300 మందికి పైగా ఆచూకీ గల్లంతు
హాంకాంగ్, నవంబరు 27: హాంకాంగ్‌లోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో నెలకొన్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో లారెన్స్ లీ అనే బాధితుడు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వందల మంది ఆచూకీ తెలియకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. థాయ్ పో జిల్లాలోని న్యూ టెరిటరిస్ ఎనిమిది భారీ అపార్ట్‌మెంట్‌ల సముదాయంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.50 గంటలకు మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఏడు అపార్ట్‌మెంట్లకు అగ్ని కీలలు వ్యాపించాయి.
బుధవారం అర్ధరాత్రి వరకు 36 మంది మృతిచెందగా.. రెండోరోజు మృతుల సంఖ్య 83కు పెరిగింది. ఈ ప్రమాదంలో 70 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకరు, క్షతగాత్రుల్లో 10మంది అగ్నిమాపకదళానికి చెందిన వారు ఉన్నారు. ఈ భవన సముదాయంలోని 2వేల ఫ్లాట్లలో 4,800 మంది నివసిస్తున్నారు. ప్రమాదం సంభవించిన రాత్రే 900మందిని అపార్ట్‌మెంట్ల నుంచి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు.
కాగా భవన సముదాయంలోని 300 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదు. ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతుండగా ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత ఓ అపార్ట్‌మెంట్ 16వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి గురువారం సాయంత్రం ఓ వ్యక్తిని సహాయక సిబ్బంది ప్రాణాలతో బయటకు తీయడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam Poised to Become Data Center Hub: విశాఖకు డేటా సెంటర్ల వెల్లువ
Mixed Reactions to District Reorganization: ఇష్టం.. కొంచెం కష్టం