Share News

Ex Con Stabbing Ukrainian Refugee: కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది.. కానీ ఇంతలోనే..

ABN , Publish Date - Sep 07 , 2025 | 08:57 AM

జరుత్‌ష్క సెల్‌ఫోన్ వాడటంలో నిమగ్నమై పోయింది. ఏం పోయే కాలమో తెలీదు కానీ, బ్రౌన్ సైకోలా మారిపోయాడు. తన దగ్గర ఉన్న కత్తితో జరుత్‌ష్కపై దాడి చేశాడు.

Ex Con Stabbing Ukrainian Refugee: కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది.. కానీ ఇంతలోనే..
Ex Con Stabbing Ukrainian Refugee

ఓ సైకో దారుణానికి ఒడిగట్టాడు. రైలులో తన ముందు సీట్లో కూర్చున్న యువతిపై కత్తితో దాడి చేశాడు. అత్యంత కిరాతకంగా ఆమెను పొడిచి చంపేశాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్న ఆ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉక్రెయిన్‌కు చెందిన 22 ఏళ్ల ఐరైనా జరుత్‌ష్క యుద్ధానికి భయపడి అమెరికా వచ్చేసింది. గతకొంత కాలంనుంచి అమెరికాలోనే ఉంటోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది.


ఆగస్టు 22వ తేదీన ఆమె చార్లెట్ లైట్ ట్రైన్ ఎక్కింది. నేరుగా వెళ్లి ఓ సీట్లో కూర్చుంది. పాపం వెనకాలే మృత్యువు కూర్చుని ఉందని ఆమెకు తెలియదు. ఆమె వెనుకాలి సీట్లో 34 ఏళ్ల డెకర్లస్ బ్రౌన్ జూనియర్ కూర్చుని ఉన్నాడు. జరుత్‌ష్క ముందు సీట్లో వచ్చి కూర్చోగానే అతడామెను చూశాడు. జరుత్‌ష్క సెల్‌ఫోన్ వాడటంలో నిమగ్నమై పోయింది. ఏం పోయే కాలమో తెలీదు కానీ, బ్రౌన్ సైకోలా మారిపోయాడు. తన దగ్గర ఉన్న కత్తితో జరుత్‌ష్కపై దాడి చేశాడు. మూడు సార్లు ఆమెను పొడిచాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


తీవ్రగాయాల కారణంగా జరుత్‌ష్క ట్రైన్‌లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు జరుత్‌ష్క శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైలులోని సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. బ్రౌన్ పాత నేరస్తుడు. అతడిపై దొంగతనం, బెదిరింపుల కేసులు ఉన్నాయి. గతంలో అరెస్ట్ అయి ఐదేళ్ల పాటు జైలులో ఉన్నాడు. పరారీలో ఉన్న బ్రౌన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రౌన్, జరుత్‌ష్కను ఎందుకు చంపాడన్నది తెలియరాలేదు.


ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ ఎంత ప్రమాదమూ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి AIMIM మద్దతు: అసదుద్దీన్

Updated Date - Sep 07 , 2025 | 08:57 AM