Plastic Packet Intact In Soil: ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:12 AM
ఓ యువకుడు గొయ్యి తవ్వుతుండగా ఓ ప్లాస్టిక్ ప్యాకెట్ దొరికింది. అతడు దాన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు. అది ‘జలని జల్జీరా’ మసాల ప్యాకెట్. దాని డిజైన్ చూస్తే పాత దానిలాగా అనిపించి వెనక్కు తిప్పాడు. ప్యాకింగ్ తేదీ చూసి షాక్ అయ్యాడు.
ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి జరిగే నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవాలంటే.. ప్లాస్టిక్ రకం, వాడే కెమికల్స్, వాతావరణ పరిస్థితులను బట్టి 10 నుంచి 1000 సంవత్సరాల వరకు పడుతుంది. రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరుగుతూ పోతోంది. వాడిపడేసిన ప్లాస్టిక్ అలానే భూమ్మీద పేరుకుపోతే మానవాళి వినాశనం తప్పదు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం జనావాసాలే కాకుండా.. నదులు, సముద్రాలు, ఆఖరికి అడవులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీదే కాదు.. భూమి లోపల కూడా పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు గొయ్యి తవ్వుతుండగా ఓ ప్లాస్టిక్ ప్యాకెట్ దొరికింది. అతడు దాన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు. అది ‘జలని జల్జీరా’ మసాల ప్యాకెట్. దాని డిజైన్ చూస్తే పాత దానిలాగా అనిపించి వెనక్కు తిప్పాడు. ప్యాకింగ్ తేదీ చూసి షాక్ అయ్యాడు. అది 1997 మార్చి నెలలో ప్యాక్ అయింది. అంటే ఆ ప్లాస్టిక్ ప్యాకెట్ 28 ఏళ్ల నాటిదన్నమాట.
తయారై 28 ఏళ్లు అవుతున్నా.. భూమిలో కప్పబడిపోయినా ఆ ప్లాస్టిక్ ప్యాకెట్ మాత్రం చెక్కు చెదరలేదు. సాధారణంగా రీయూజబుల్ ప్లాస్టిక్ కారణంగా పెద్దగా నష్టం లేదు. కానీ, ఒకసారి మాత్రమే వాడిపడేసే ప్లాస్టిక్ కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. దానికి తోడు పల్చటి ప్లాస్టిక్ కవర్లు పర్యావరణాన్ని దెబ్బతీయటమే కాదు.. మూగ జీవాలను కూడా చంపేస్తున్నాయి. 1970 నుంచి ఇండియాలో ప్లాస్టిక్ వాడకంలో పెరుగుదల మొదలైంది. 2000 నుంచి అది తారాస్థాయికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి
రూ. 40 కోసం కన్న తల్లిని చంపేసిన కొడుకు..
అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..