Share News

Man Assasinates Mother For 40: రూ. 40 కోసం కన్న తల్లిని చంపేసిన కొడుకు..

ABN , Publish Date - Sep 07 , 2025 | 07:28 AM

రాజారామ్ బాగా తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. 40 రూపాయలు ఇవ్వమన్నాడు. రాజేశ్వరికి బాగా కోపం వచ్చింది. డబ్బులు లేవని తేల్చి చెప్పింది.

Man Assasinates Mother For 40: రూ. 40 కోసం కన్న తల్లిని చంపేసిన కొడుకు..
Man Assasinates Mother For 40

ఓ వ్యక్తి 40 రూపాయల కోసం కన్నతల్లిని అతి కిరాతకంగా చంపేశాడు. మద్యం తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇటుకతో తల్లి తలపై కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాన్పూర్‌లోని కసింగ్వ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రాజారామ్ మద్యానికి బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లి రాజేశ్వరిని తరచుగా వేధిస్తూ ఉండేవాడు. ఇవ్వకపోతే కొట్టేవాడు. అందుకే అతడు అడగ్గానే ఆమె డబ్బులు ఇచ్చేది.


శనివారం సాయంత్రం రాజారామ్ బాగా తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. 40 రూపాయలు ఇవ్వమన్నాడు. రాజేశ్వరికి బాగా కోపం వచ్చింది. డబ్బులు లేవని తేల్చి చెప్పింది. దీంతో అతడు బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. తల్లిపై దాడి చేశాడు. ఆమె భయపడిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. రాజారామ్ కోపం కట్టలు తెంచుకుంది. తలుపులు బద్ధలుకొట్టాడు. జుట్టు పట్టుకుని తల్లిని బయటకు లాక్కుని వచ్చాడు.


అక్కడ నేలపై ఉన్న ఇటుక తీసుకుని ఆమె తలపై పలుమార్లు దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన రాజేశ్వరి అక్కడికక్కడే చనిపోయింది. తల్లి చనిపోయిందని తెలియగానే రాజారామ్ అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. గ్రామస్తులు అతడ్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్వరి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

వరదంతా సముద్రంలోకే

వందే భారత్‌కు జై

Updated Date - Sep 07 , 2025 | 07:34 AM