Baloch Liberation Army: పాక్ సైన్యంపై విరుచుకుపడ్డ బలోచ్ డెత్ స్క్వాడ్
ABN , Publish Date - May 04 , 2025 | 04:47 AM
భారత సరిహద్దుల్లో పాక్ సైన్యం బిజీగా ఉన్న సమయంలో బలోచిస్థాన్‌లో బీఎల్‌ఏకు చెందిన డెత్ స్క్వాడ్ మంగోచెర్ నగరాన్ని ఆక్రమించి, ప్రభుత్వ భవనాలు, ఆర్మీ క్యాంపును తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ దాడిలో పది మంది పాక్ సైనికులు హతమయ్యారు.
క్వెట్టా, మే 3: పహల్గాం దుర్ఘటన అనంతరం భారత సరిహద్దులో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు బలోచిస్థాన్‌లో మరో దెబ్బ తగిలింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఏకంగా పాక్ సైన్యంపై విరుచుకుపడింది. బీఎల్‌ఏకు చెందిన ‘డెత్ స్క్వాడ్’ కలత్ జిల్లాలోని మంగోచెర్ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను కూడా తన కంట్రోల్‌లో ఉంచుకుంది. బలోచ్ తిరుగుబాటుదార్లు ఆర్మీ క్యాంపుపై దాడి చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ తన సైన్యాన్ని భారత్ సరిహద్దుకు తరలిస్తున్న తరుణంలో బలూచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. గతనెల 26న జరిగిన దాడిలో 10 మంది పాక్ సైనికులు మరణించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..