Arizona Plane Crashe : అరిజోనాలో కూలిన వైద్య రవాణా విమానం.. నలుగురు మృతి
ABN , Publish Date - Aug 06 , 2025 | 08:26 AM
ఉత్తర అరిజోనాలోని నవజో నేషన్‌లో మంగళవారం వైద్య రవాణా విమానం కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారని అక్కడి అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అరిజోనాలోని నవాజో నేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒక వైద్య రవాణా విమానం కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. చిన్లే మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక పేషెంట్‌ను తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. అయితే, ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన CSI ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం, ఫీనిక్స్‌కు ఈశాన్యంగా 300 మైళ్లు (483 కిలోమీటర్లు) దూరంలో ఉన్న చిన్లేలోని విమానాశ్రయానికి సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. చిన్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఒక తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో దురదృష్టవశాత్తు ఏదో తప్పు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని జిల్లా పోలీసు కమాండర్ ఎమ్మెట్ యాజ్జీ వెల్లడించారు. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, FAA దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.

ఈ విషయంపై నవజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధకారమన్నారు. కాగా, జనవరిలో ఫిలడెల్ఫియాలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయి ఎనిమిది మంది మరణించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఆ విమానంలోని వాయిస్ రికార్డర్ పనిచేయడం లేదని తెలిపింది.
Also Read:
ఒక రోజులో ఎన్ని అరటిపండ్లు తినాలి?