World Rose Day 2025: ప్రపంచ గులాబీ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:20 PM
ఈరోజు ప్రపంచ గులాబీ దినోత్సవం. అయితే, ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (సెప్టెంబర్ 22) ప్రపంచ గులాబీ దినోత్సవం. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజును జరుపుకుంటారు. కెనడాలో క్యాన్సర్ బారినపడిన 12 ఏళ్ల అమ్మాయి జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ గులాబీ దినోత్సవం ప్రాముఖ్యత
తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకుంటారు. కెనడాలో నివసిస్తున్న 12 ఏళ్ల బాలిక మెలిండా రోజ్ 1974 సెప్టెంబర్ నెలలో బ్లడ్ క్యాన్సర్‌తో మరణించినందున ఈ రోజును రోజ్ డే అని పిలుస్తారు. ఆమెతో క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్నప్పటికి ఆనందంగా గడిపిన జీవితం క్యాన్సర్ రోగులకు ఆశను కల్పించింది. ఈ దినోత్సవం క్యాన్సర్ రోగుల పట్ల సానుభూతిని వ్యక్తం చేయడమే కాకుండా, జీవితం పట్ల ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉండాలనే సందేశాన్ని ఇస్తుంది.
ప్రపంచ గులాబీ దినోత్సవం నాడు, క్యాన్సర్ రోగులకు గులాబీలు, వ్యక్తిగత సందేశాలు అందించి, వారిని ప్రోత్సహిస్తారు. దీనితో పాటు, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యాన్సర్ రోగుల పట్ల సంఘీభావం తెలియజేసి, వారి పోరాటంలో వారికి అండగా నిలబడేందుకు స్ఫూర్తినిస్తారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి మద్దతు, అవగాహన, ఆశను అందించే లక్ష్యంతో గులాబీ పువ్వులు ఇస్తారు. ఈ దినోత్సవం క్యాన్సర్‌తో జీవిస్తున్న వారి ధైర్యసాహసాలను, అంతర్జాతీయ ఐక్యతను, సంఘీభావాన్ని తెలియజేస్తుంది.
Also Read:
షాకింగ్ రిపోర్ట్.. పుట్టుకతోనే 41,000 మంది పిల్లలకు గుండె జబ్బులు
వామ్మో.. ఉల్లిపాయ ఇన్ని సమస్యలను దూరం చేస్తుందా..
For More Latest News