Women Health: పీరియడ్స్ సమయంలో మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:18 AM
స్త్రీలు పీరియడ్స్ సమయంలో తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించకపోతే, అది అనేక వ్యాధుల ప్రమాదానికి దారితీస్తుంది.
ఆడవారికి నెలసరి నేచురల్. ప్రతి నెల మూడు లేదా ఐదు రోజుల వరకు ఆ బాధను భరించాల్సిందే. పీరియడ్స్ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. లేదంటే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, పరిశుభ్రంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈ సమయంలో మహిళలు ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేటంటే..
పరిశుభ్రత లేకపోతే
పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), పునరుత్పత్తి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (RTI), చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, మహిళలు దద్దుర్లు, చర్మపు చికాకులకు కూడా గురవుతారు. ఎక్కువసేపు ఒకే ప్యాడ్ ధరించడం వల్ల దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా దద్దుర్లు వస్తాయి. పదేపదే ఇన్ఫెక్షన్ వస్తే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉపయోగించండి.
ప్రతి 4-6 గంటలకు ప్యాడ్‌లను మార్చాలి.
ఉపయోగించిన ప్యాడ్‌ను కాగితంలో చుట్టి పారవేయండి.
పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే, డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు తీసుకోండి.
Also Read:
ఉదయం ఖాళీ కడుపుతో 2 అంజీర పండ్లు తింటే.. 5 అద్భుతమైన ప్రయోజనాలు..
ఎక్కువగా ప్రోటీన్ షేక్ తాగుతున్నారా.. జాగ్రత్త..
For More Health News