Share News

Stair Climbing vs Walking: నడక vs మెట్లు ఎక్కడం.. బరువు తగ్గడానికి ఏది మంచిది..

ABN , Publish Date - Feb 19 , 2025 | 09:16 AM

చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో నడవడం, మెట్లు ఎక్కడం వంటి పనులు కూడా చేస్తారు. అయితే, ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిది? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Stair Climbing vs Walking: నడక  vs మెట్లు ఎక్కడం.. బరువు తగ్గడానికి ఏది మంచిది..
Walking vs Stair Climbing

శరీరం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. లేదంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. వ్యాయామాలపై దృష్టి పెట్టడం ద్వారా ఫిట్‌నెస్ పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో నడవడం, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు చేస్తారు. అయితే, ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిది? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ పని చేయడం అంటే ఎక్కువ కేలరీలు ఖర్చు చేయడం. 15 నిమిషాల మెట్లు ఎక్కడం = 45 నిమిషాల చురుకైన నడక. మీరు వాకింగ్ లేదా రన్నింగ్‌కు బయటకు వెళ్లాల్సి వస్తుంది కానీ, ఇంట్లోనే మెట్లు ఎక్కడం వల్ల మీ కండరాలు యాక్టివ్ అవుతాయి. నడక కన్నా కూడా మెట్లు ఎక్కే సమయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు మెట్లు ఎక్కడం చాలా మంచిది. అయితే, కొన్ని సమస్యలు ఉన్న వారు మెట్లు ఎక్కడం మంచిది కాదు.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

  • మెట్లు ఎక్కడం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మీరు దానిని నివారించాల్సిన ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి.

  • మీకు 70 ఏళ్లు పైబడి ఉంటే లేదా కీళ్ళు, మోకాలి సమస్యలు ఉంటే మెట్లు ఎక్కడం మంచిది కాదు.

  • మీరు గర్భవతిగా ఉండి, ప్రసవానికి దగ్గరగా ఉంటే మెట్లు ఎక్కకూడదు.

  • మీరు ఇటీవల యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లయితే లేదా గుండె సమస్య కలిగి ఉంటే మెట్లు ఎక్కడం మంచిది కాదు.

  • మీరు శరీర దిగువ భాగంలో జరిగిన గాయం నుండి కోలుకుంటుంటే మెట్లు ఎక్కనవసరం లేదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read: స్కూల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌కు 76 ప్రాజెక్టులు ఎంపిక

Updated Date - Feb 19 , 2025 | 09:24 AM