Diet: ఆహారం జీర్ణమయ్యేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసా?
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:39 PM
కొన్ని రకాల ఫుడ్స్ త్వరగా జీర్ణమైతే మరికొన్ని అరగడానికి రెండు రోజుల వరకూ పడుతుంది. వ్యక్తుల వయసు, జీర్ణక్రియల వేగం, ఆహారం తీరు వంటివన్నీ ఆహారం ఎంత త్వరగా జీర్ణమవుతుందో నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి తెలీకుండానే అతిగా తినేసి కొందరు కడుపుబ్బరం, నొప్పితో ఇబ్బందిపడతారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఏయే ఆహారం జీర్ణమయ్యేందుకు ఎంత సమయం పడుతుందో తెలిసుండాలి.
ఆహారాన్ని శరీరంలోని కణాలు గ్రహించే సూక్ష్మ భాగాలుగా విడగొట్టడమే జీర్ణ వ్యవస్థ చేసే పని. అయితే, కొన్ని ఫుడ్స్ జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతోంది. మరికొన్ని త్వరగా జీర్ణమైపోతాయి. సాధారణ పిండిపదార్థాలు త్వరగా జీర్ణమైపోతాయి. అయితే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యేందుకు మాత్రం చాలా టైం పడుతుంది. ఇక పండ్లల్లో లభించే సాల్యుబుల్ ఫైబర్స్ కూడా త్వరగానే జీర్ణమవుతాయి (Health).
Skin Care: ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు.. డెర్మటాలజిస్టు సూచన
ఇక మాంసాహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టొచ్చు. అలాగే పీచు పదార్థం అధికంగా ఉండే పళ్లు, కూరగాయలు కూడా కాస్త ఆలస్యంగానే జీర్ణం అవుతాయి. ఇక ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు జీర్ణం కావడం మరింత సంక్లిష్టం. దీనికి చాలా సమయమే పడుతుంది. మంచినీటిని జీర్ణం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇవి తాగిన వెంటనే పేగుల ద్వారా శరీరంలోకి చేరిపోతాయి.
నోటి ద్వారా తీసుకున్న ఆహారం పూర్తిగా శరీరం నుంచి మలం రూపంలో ఎంత సేపటికి బయటకు పోతుందనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వయసు, జీవక్రియల వేగం వంటివన్నీ దీన్ని ప్రభావితం చేస్తాయి. ఇక వయసుతో పాటు జీర్ణశక్తి తగ్గిపోతుంది. నవజాత శిశువులు, పిల్లల్లో జీర్ణక్రియ అత్యంత వేగంగా సాగుతుంది.
Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..
జీర్ణవ్యవస్థ పనితీరు ఇలా..
ఆహారం నమలడంతోనే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. లాలాజలంలోని కొన్ని ఎంజైములు ఆహారంలోని కార్బోహైడ్రేట్లను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. ఆ తరువాత ఇది అన్నవాహిక గుండా కడుపులోకి చేరుతుంది. అక్కడి జీర్ణరసాలు, ఎంజైములతో కలుస్తుంది. సంక్లిష్టమైన ఆహారపదార్థాలను సరళమైన సూక్ష్మపదార్థాలుగా మార్చేందుకు ఇది అత్యవసరం. ఈ మొత్తం ప్రక్రియకు రెండు నుంచి నాలుగు గంటలు పడుతుంది.
ఇలా పాక్షికంగా జీర్ణమైన ఆహారం పేగుల్లోకి ప్రవేశించి, బైల్, ఎంజైమ్‌లతో కలుస్తుంది. ఈ క్రమంలో ఆహారం మరింతగా జీర్ణమవుతుంది. అతి సూక్షమైన అమైనోయాసిడ్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులుగా మారిపోతుంది. వీటిని శరీరం గ్రహిస్తుంది. జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహారం, నీరు, పీచుపదార్థం పెద్ద పేగుల్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మిగిలిన నీరు, ఇతర లవణాలను శరీరం మరింతగా గ్రహించాక మిగిలిన పదార్థాలు మలం రూపంలో విసర్జితమవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి 12 నుంచి 48 గంటల వరకూ పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!