Walking Benefits: వాకింగ్.. రోజూ నడవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ABN , Publish Date - Jul 09 , 2025 | 08:02 AM
వాకింగ్ కూడా ఒక రకమైన యోగా లాంటిదే అని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే, వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Walking Benefits: వాకింగ్ అనేది ఒక సాధారణ వ్యాయామం. ప్రతిరోజూ నడవడం చాలా మంచిది. ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది సులభమైన, తక్కువ ప్రభావం చూపే వ్యాయామం. రక్త ప్రసరణ నుండి గుండె ఆరోగ్యం వరకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజూ నడవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే, వాకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
వాకింగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గించడం, డిప్రెషన్‌ను తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో వాకింగ్ ఎంతగానో సహాయపడుతుంది.
వాకింగ్ శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల మరింత ఫిట్‌గా కూడా ఉంటారు.
జాగ్రత్తలు:
పార్కులో వాకింగ్‌కు వెళ్లడం మంచిది.
వాకింగ్ చేసేటప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.
సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. లేదంటే వాకింగ్‌కు వెళ్లినప్పుడు పాదాలకు గాయాలు అయ్యే అవకాశం ఉంది.
నడకతో పాటు, ఇతర వ్యాయామాలను కూడా చేయండి.
Also Read:
జాగ్రత్త.. ఉదయం ఈ 4 అలవాట్లు మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయి..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు..!
For More Health News