Morning Health Mistakes: జాగ్రత్త.. ఉదయం ఈ 4 అలవాట్లు మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయి..!
ABN , Publish Date - Jul 08 , 2025 | 08:11 AM
ఉదయం ఈ 4 అలవాట్లు మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మీ కాలేయానికి హాని కలిగించే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
Morning Health Mistakes: కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన ఒక అవయవం. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరమూ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ, మన తప్పుడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి మన కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఉదయం ఈ 4 అలవాట్లు మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మీ కాలేయానికి హాని కలిగించే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
అల్పాహారం తీసుకోకపోవడం
చాలా మంది డైటింగ్ అంటూ ఉదయం అల్పాహారం తినడం మానేస్తారు. కానీ, మీ కాలేయం పనిచేయడానికి శక్తి అవసరమని మర్చిపోకండి. ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇది ఏదో ఒక విధంగా కాలేయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, తప్పకుండా అల్పాహారం తీసుకోండి. తక్కువ చక్కెర, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉన్న అల్పాహారం తీసుకోండి.
ఖాళీ కడుపుతో సప్లిమెంట్లు తీసుకోవడం
చాలా మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండా సప్లిమెంట్లు లేదా నొప్పి నివారణ మందులు తీసుకుంటారు. కాలక్రమేణా, ఇది వారి కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయం సరిగ్గా డీటాక్స్ చేయలేకపోతుంది. కాబట్టి, తిన్న తర్వాత మాత్రమే సప్లిమెంట్లను తీసుకోవడానికి ప్రయత్నించండి.
ఉదయం వ్యాయామం చేయకపోవడం
చాలా మంది ఉదయం తమకు వ్యాయామం చేయడానికి టైం ఎక్కువ ఉండదని అంటారు. కానీ, ఎక్కువ సమయం లేకపోయినా నడక లేదా యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇది మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
డీటాక్స్ పానీయాలు ఎక్కువగా తీసుకోవడం
చాలా మంది తమ శరీరాన్ని డీటాక్స్ చేయడానికి అధికంగా డీటాక్స్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది కాలేయానికి మంచిది కాదు. మీరు సాధారణ నిమ్మకాయ నీరు లేదా సాధారణ కలబంద రసం తాగడం ద్వారా మీ శరీరాన్ని డీటాక్స్ చేయవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ జంతువు పాలు చాలా డేంజర్.. ఎందుకంటే..
ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..
For More Health News