Share News

Vitamin-E Overdose: విటమిన్-ఈ సప్లిమెంట్స్ తీసుకుంటారా.. ఈ లిమిట్ దాటితే డేంజర్

ABN , Publish Date - May 31 , 2025 | 02:20 PM

విటమిన్ ఈ సప్లిమెంట్స్‌ను అతిగా తీసుకుంటే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మరి రోజువారి పరిమితి ఏమిటో, ఈ లిమిట్ దాటితే ఏమవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Vitamin-E Overdose: విటమిన్-ఈ సప్లిమెంట్స్ తీసుకుంటారా.. ఈ లిమిట్ దాటితే డేంజర్
Vitamin-E Overdose

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి విటమిన్-ఈ చేసే మేలు అంతాఇంతా కాదు. ఇది బ్లడ్ క్లాట్స్‌ను నివారిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుంచి కణజాలాన్ని రక్షిస్తుంది. యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న విటమిన్-ఈ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గింజలు, విత్తనాలు, కూరగాయలతో పాటు ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ద్వారా విటమిన్-ఈ లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక లోపం తీవ్రంగా ఉన్న సమయాల్లో డాక్టర్ల సూచన మేరకు సప్లి‌మెంట్స్ కూడా తీసుకోవచ్చు.

విటమిన్-ఈ తో ఊపిరితిత్తులు, మెదడు, లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది. నెలసరి సమస్యల నుంచి కూడా కొంత వరకూ ఉపశమనం లభిస్తుంది. అయితే, విటమిన్ ఈ సప్లిమెంట్స్ తీసుకోదలిచిన వారు వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలి. ఇష్టారీతిన సప్లిమెంట్స్ తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు.


వైద్యులు చెప్పే దాని ప్రకారం, సాధారణ వ్యక్తులకు రోజుకు 15 మిల్లీగ్రాముల విటమిన్-ఈ అవసరం. అయితే, వైద్యుల పర్యవేక్షణలో రోజుకు గరిష్ఠంగా 1100 మిల్లీగ్రాముల విటమిన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కొవ్వులో కరిగిపోయే గుణం ఉన్న విటమిన్-ఈ లివర్‌లోపల నిల్వ ఉంటుంది. దీనికి శరీరంలో ఎక్కువ కాలం నిలిచుండే గుణం ఉండటంతో దీన్ని విసర్జించడం కొంచెం కష్టం. కాబట్టి పరిమితికి మించి తీసుకునే విటమిన్-ఈ లివర్‌తో పాటు కొవ్వు అధికంగా ఉండే భాగాల్లో పేరుకుంటుంది. చివరకు విటమిన్-ఈ టాక్సిసిటీకి దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్లకు వాంతులు, నీరసం మొదలు ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. కొందరిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కూడా దారి తీయొచ్చు.


ఇక యాంటీకొయాగ్యులెంట్స్ తీసుకునే వారికి విటమిన్ ఈ టాక్సిసిటీ మరింత ప్రమాదకరం. విటమిన్ ఈ ఎక్కువైన సందర్భాల్లో విటమిన్ కే ఆధారిత కొయాగ్యులేషన్ ఫ్యాక్టర్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడతాయి. దీంతో, పేగులు, మెదడులో అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది. ఇతర ఔషధాలపై కూడా విటమిన్ ఈ ప్రభావం ఎక్కువ.

అయితే, విటమిన్-ఈ టాక్సిసిటీని తొలగించుకునేందుకు సప్లిమెంట్స్ వినియోగం మానేస్తే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బాడీ బిల్డర్స్‌కు హార్ట్ ఎటాక్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో వెల్లడి

ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్‌లో పడ్డట్టే

Read Latest and Health News

Updated Date - May 31 , 2025 | 02:27 PM