Toothbrush: మీ టూత్ బ్రష్‌ను ఇలా శుభ్రంగా పెట్టుకోండి.. లేదంటే ప్రమాదం తప్పదు..
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:05 AM
కలుషితమైన టూత్ బ్రష్‌ను పదే పదే ఉపయోగించడం వల్ల సూక్ష్మక్రిములు నోటిలోకి ప్రవేశిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి, మీ టూత్ బ్రష్‌ను ఇలా శుభ్రంగా ఉంచుకోండి..

Toothbrush: దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బ్రష్ చేయడం మాత్రమే సరిపోదు. దాని కోసం, మీరు మీ టూత్ బ్రష్‌ను ఎలా పెట్టుకుంటున్నారనేది కూడా చాలా ముఖ్యం. టూత్ బ్రష్‌ను క్లీన్‌గా పెట్టుకోవాలి.. అంటే కేవలం బ్రష్ చేసిన తర్వాత వాటర్‌తో కడగడం కాదు. టూత్ బ్రష్‌ను శుభ్రం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చాలా మంది తమ టూత్ బ్రష్‌లను శుభ్రంగా ఉంచుకోరు.. ఎక్కడపడితే అక్కడ పెడుతుంటారు. ఎక్కువగా టాయిలెట్ల దగ్గర ఉంచుతారు. కానీ, అలా పెట్టడం కరెక్ట్ కాదు. ఈ కధనంలో మనం టూత్ బ్రష్‌ను ఎలా క్లీన్‌గా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టూత్ బ్రష్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తేమతో కూడిన వాతావరణంలో టూత్ బ్రష్‌లు ఉంచడం మంచిది కాదని.. వాటికి బ్యాక్టీరియా చేరుతుందని చెబుతున్నారు. ఈ సూక్ష్మజీవులు చాలా ప్రమాదకరం కానప్పటికీ, స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్, కావిటీస్ సమస్యలు వస్తాయని అంటున్నారు. కలుషితమైన టూత్ బ్రష్‌ని పదే పదే ఉపయోగించడం వల్ల క్రిములు నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. ఇది చిగురువాపు, పీరియాంటైటిస్ లేదా ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుందని చెబుతున్నారు.
టూత్ బ్రష్‌లలో ఉండే బ్యాక్టీరియా నోటి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
టూత్ బ్రష్‌లోని హానికరమైన సూక్ష్మజీవులు నోటిలోకి ప్రవేశించి దంత క్షయం, చిగుళ్ల వ్యాధిని కలిగిస్తాయి. టూత్ బ్రష్‌లపై ఉండే వ్యాధికారకాలు నోటి దుర్వాసన వంటివి మరింత తీవ్రతరం చేస్తాయని లేదా ముందుగా ఉన్న చిగుళ్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి.
టూత్ బ్రష్‌ను ఇలా క్లీన్‌గా పెట్టుకోండి..
టూత్ బ్రష్‌ను బాగా కడగాలి.
తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి, టూత్ బ్రష్‌ను గాలికి ఆరనివ్వండి.
టూత్ బ్రష్‌కు క్యాప్ పెట్టకూడదు. ఎందుకంటే ఇది తేమను పెంచి సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మీ టూత్ బ్రష్‌ను మార్చండి.
UV శానిటైజర్లు టూత్ బ్రష్‌లపై ఉన్న బ్యాక్టీరియాను 99% వరకు తగ్గించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి.
టూత్ బ్రష్‌ను యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్‌లో ఉంచండి. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది.
టూత్ బ్రష్‌ను వేడి నీటిలో కొన్ని నిమిషాలు పెట్టండి. దీని వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ, తరచూ ఇలా చేయడం వల్ల బ్రిస్టల్స్ దెబ్బతింటాయి.
కొంతమంది తమ టూత్ బ్రష్‌లను శుభ్రం చేయడానికి డిష్‌వాషర్‌లో ఉంచుతారు. ఎందుకంటే ఇది సూక్ష్మక్రిములను చంపుతాయని.. కానీ, ఇది టూత్ బ్రష్ కాల వ్యవధిని తగ్గిస్తుంది.