Share News

Walking: నడుస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఊపిరి ఆడక ఇబ్బందిగా ఉందా..

ABN , Publish Date - Feb 17 , 2025 | 07:44 AM

సరైన నడక ఆరోగ్యానికి చాలా మంచిది. నడకలో సరైన మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు. అయితే, ఎలాంటి మార్పులు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..

Walking: నడుస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఊపిరి ఆడక ఇబ్బందిగా ఉందా..
Walking

నడక అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేసే అలవాటు. కానీ నడుస్తున్నప్పుడు ఊపిరి ఆడకపోవడం అనే సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. అనేక కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొని పరిష్కారం కనుగొనాలి. సాధారణ కారణాలలో శారీరక దృఢత్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలాగే ఉబ్బసం, గుండె సమస్యలు లేదా చాలా వేగంగా నడవడం వంటి వల్ల నడుస్తున్నప్పుడు ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే, నడకలో సరైన మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చ. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెమ్మదిగా నడవండి..

వ్యాయామం ప్రారంభించినప్పుడు చాలా మంది వేగంగా నడుస్తారు. అయితే, ఇలా నడవడం మంచిది కాదు. నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించండి. నడవడం ప్రారంభించిన వారు ఒకేసారి ఎక్కువ దూరం నడవకూడదు. తక్కువ దూరం నెమ్మదిగా నడవడం ప్రారంభించండి. ఈ విధానం శక్తిని, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ వ్యవస్థకు కూడా సహాయపడుతుంది.

విరామం తీసుకుంటారా?

మీరు నడుస్తున్నప్పుడు విరామం తీసుకుంటారా? లేకపోతే, విరామం తీసుకోవడానికి ప్రయత్నించండి. వేగంగా నడిచే మధ్య కొద్దిసేపు విరామం తీసుకోవడం మంచిది. ఉదాహరణకు, మీరు రెండు నిమిషాలు వేగంగా నడిచి, ఆపై ఒక నిమిషం విరామం తీసుకోవచ్చు. ఈ పద్ధతి క్రమంగా ఫిట్‌నెస్‌కు సహాయపడటమే కాకుండా శ్వాసకోశ సమస్యలను కూడా తొలగిస్తుంది. మొదటి 5 నిమిషాలు సౌకర్యవంతమైన వేగంతో వార్మప్ వాక్ చేయండి.


నీళ్లు పుష్కలంగా తాగాలి

నిర్జలీకరణం, అలాగే పోషకాహార లోపం, శ్వాసకోశ సమస్యలు మొత్తం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నడిచే ముందు, తర్వాత పుష్కలంగా నీరు తాగండి. ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. శ్వాసకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది చాలా అవసరం.

నిటారుగా ఉండేలా

మీరు తడబడకుండా, నేరుగా, నిటారుగా నడవడానికి ప్రయత్నించాలి. మీ శరీరం నిటారుగా ఉండేలా చూసుకోండి. వంగి నడవడం మానుకోండి. ఎందుకంటే ఇది ఊపిరితిత్తులకు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read: మీకు ఈ అలవాట్లు ఉంటే.. లివర్‌కు ముప్పు పొంచి ఉన్నట్టే

Updated Date - Feb 17 , 2025 | 08:37 AM