Health Tips: ఈ లక్షణాలు క్యాన్సర్‌కు సంకేతాలు.. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు..
ABN , Publish Date - May 21 , 2025 | 03:46 PM
వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు. 40 ఏళ్లు పైబడిన వారు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ లక్షణాలు క్యాన్సర్‌కు సంకేతాలని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దని సూచిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇది లక్షలాది మంది మరణానికి కారణమవుతుంది. క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది సకాలంలో చికిత్స పొందలేక మరణిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు. 40 ఏళ్లు పైబడిన వారు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి.
వైద్య నిపుణుల ప్రకారం, క్యాన్సర్ రావడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. అధిక బరువు లేదా ఊబకాయం, ఎక్కువగా మద్యం సేవించడం లేదా ధూమపానం, జన్యుపరంగా కూడా క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి, క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్సర్లు
శరీరంలోని అనేక భాగాలలో అల్సర్లు కనిపించవచ్చు. ప్రభావిత ప్రాంతంలో చిన్న గాయాలు ఉండవచ్చు. చర్మంపై లేదా నోటి లోపల అటువంటి గాయాలు ఉండటం నోటి క్యాన్సర్‌కు సంకేతం. మీరు చాలా కాలంగా అల్సర్లతో బాధపడుతుంటే లేదా పదే పదే అల్సర్లు వస్తుంటే వైద్య నిపుణులను సంప్రదించండి. కొన్ని అల్సర్లు క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయి.
రక్తస్రావం సమస్య
మీకు తరచుగా అసాధారణ రక్తస్రావం ఉంటే ఈ లక్షణంపై శ్రద్ధ వహించాలి. దగ్గేటప్పుడు రక్తం రావడం, మలంలో రక్తస్రావం కావడం పెద్దప్రేగు క్యాన్సర్ సంకేతాలు. కాబట్టి, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అసాధారణ గడ్డ లేదా వాపు
శరీరంలో ఒక వారం కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగే ఏదైనా అసాధారణ గడ్డ లేదా వాపు ఉంటే నిపుణుడిని సంప్రదించాలి. మెడలో వాపు మెడ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. అలాగే, రొమ్ములో వాపు రొమ్ము క్యాన్సర్‌కు సంకేతంగా ఉండవచ్చు. మీరు శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటుంటే సకాలంలో వైద్యుడిని సంప్రదించండి.
Also Read:
Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం
Puja Khedkar: ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?.. పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు
Jyoti Malhotra: పహల్గాం దాడికి ముందే ఇలా చేశాను.. జ్యోతి మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు